Begin typing your search above and press return to search.

సావిత్రిలో సమంత.. 'మహానటి' కాదు!!

By:  Tupaki Desk   |   22 Dec 2016 4:48 AM GMT
సావిత్రిలో సమంత.. మహానటి కాదు!!
X
అలనాటి అభినేత్రి మహానటి సావిత్రి జీవితంపై తీస్తున్న బయోపిక్ 'మహానటి'. ఈ మూవీ గురించిన మాటలు ఏడాదిగా వింటున్నాం కానీ.. ఈ మధ్యే మహానటి ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చింది. క్యాస్టింగ్ ఫైనలైజ్ చేసేసి షూటింగ్ కి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు.

మహానటిలో సావిత్రిగా ఎవరు నటిస్తారన్నది పెద్ద సస్పెన్స్. సమంత ఇందులో నటిస్తోందని ఓసారి.. లేదని మరోసారి వార్తలొచ్చాయి. అయితే.. మహానటి మూవీలో సమంత నటిస్తోందనే విషయం ఇప్పుడు దాదాపు ఖాయం అయింది. అయితే.. శామ్స్ చేస్తున్నది సావిత్రి పాత్రలో కాదనే విషయమే అసలైన హైలైట్. మహానటిలో సమంత కనిపించినా.. సావిత్రి జీవితాన్ని ఆమె కళ్ల నుంచే వివరించేలా స్క్రిప్టింగ్ ఉంటుందట. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమాలో అసలు టైటిల్ పాత్రధారిణిని ఇంకా ఫైనలైజ్ చేయలేదట కూడా.

నిత్యామీనన్.. విద్యాబాలన్ లను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తున్నా.. అందులో కూడా నిజం లేదని అంటున్నారు. కొంతమంది నటీమణులతో చర్చించిన మాట వాస్తవమే అయినా.. ఇంకా ఎవరినీ ఫైనలైజ్ చేయలేదన్నది నిర్మాతల వెర్షన్. ఈ మహానటిని 2017 ఫిబ్రవరి నాటికి సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/