Begin typing your search above and press return to search.

సింగపూర్ లో శామ్ అందాలు చూడతరమా

By:  Tupaki Desk   |   17 Sept 2016 9:00 PM IST
సింగపూర్ లో శామ్ అందాలు చూడతరమా
X
సమంత ఈ మధ్య బైట కనిపించడం బాగా తగ్గించేసింది. అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అడపా దడపా మెరవడం తప్పిస్తే.. విడిగా ఈ అమ్మడి దర్శనం కూడా కరువైపోయింది. ఆమధ్య జనతా గ్యారేజ్ కి ప్రమోషన్స్ తర్వాత.. మాయమైపోయిన సమంత మళ్లీ ఇన్నాల్టికి ఫ్యాన్స్ కి దర్శనభాగ్యం కల్పించింది.

రీసెంట్ గా ఓ ఈవెంట్ కోసం సింగపూర్ వెళ్లిన శామ్ కు అక్కడి అందాలు తెగ నచ్చేశాయి. అంతే.. అక్కడి ప్రకృతిని.. తన సొగసులను కలిపి అభిమానులకు చూపించాలని నిర్ణయించుకున్న సమంత.. కొన్ని ఫోటోలు దిగేసి షేర్ చేసుకుంది. ఫుల్లుగా కవర్ చేసుకున్నవాటితో పాటు. పొట్టి పొట్టి బట్టల్లోనూ మెరిసింది ఈ వయ్యారు. అయితే.. డ్రస్ ఎలా ఉందనే దాని కంటే.. డ్రసింగ్ ఎలా ఉందనే పాయింట్ చాలా ముఖ్యం అని సమంతకు బాగానే తెలుసు. అందుకే అమ్మడికి అంత క్రేజ్.

ఇదంతా బాగానే ఉంది కానీ.. నెక్ట్స్ సినిమా ఏంటి సమంతా అంటే మాత్రం.. ఈ చిన్నదాని దగ్గర నుంచి సరైన సమాధానం మాత్రం రావడం లేదు. పోనీ పెళ్లి సంగతులైనా చెబుతుందా అంటే.. అసలు ఈ సంగతే అడగద్దు అన్నట్లుగా ఉంది సమంత వాలకం.