Begin typing your search above and press return to search.

మైయోసైటిస్ థర్డ్ స్టేజ్ లో సమంత.. వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది?

By:  Tupaki Desk   |   22 Nov 2022 2:30 AM GMT
మైయోసైటిస్ థర్డ్ స్టేజ్ లో సమంత.. వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది?
X
దక్షిణాది అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు గత కొంతకాలంగా మైయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూనో వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్న సామ్.. ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించింది.

సమంత అనారోగ్యంతో బాధ పడుతుండటంతో.. ఆమె అభిమానులు మరియు శ్రేయోభిలాషులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పలువురు సినీ ప్రముఖులు దైర్యం చెబుతూ ట్వీట్స్ చేశారు. ఆమె త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థించారు.

సమంత పోరాడుతున్న వ్యాధిపై నటి కలిక గణేష్ తాజాగా స్పందించింది. ఓ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కల్పిక.. సామ్ లాగే తనకు కూడా మయోసైటిస్ డిసీజ్ ఉందని పేర్కొంది. అయితే ఆమెది ఫస్ట్ స్టేజ్ అని చెప్పింది.

"గత 13 ఏళ్లుగా స్పాండిలైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నాను. సమంత కు ఉన్న వ్యాధి నాక్కూడా వుంది. కాకపొతే నేను ఫస్ట్ స్టేజ్ లో ఉంటే.. ఆమె థర్డ్ స్టేజిలో వుంది. ఒకసారి ఆమెని కలిసి దీని గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని కల్పిక చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న కల్పిక గణేష్.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'యశోద' మూవీలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ.. సామ్ ఆరోగ్యం గురించి కల్పిక వెల్లడించింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపింది.

సమంత ఇప్పుడు మయోటైసిస్ థర్డ్ స్టేజిలో ఉందని తెలియడంతో ఆమె ఆరోగ్యం గురించి అభిమానులు మరింతగా కలవర పడుతున్నారు. ఆ దశలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? వ్యాధి తీవ్రత ఏ విధంగా వుంటుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? అంటూ ఆరాలు తీస్తున్నారు.

అయితే "యశోద" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రికార్డు చేసిన ఇంటర్వ్యూలో సామ్ ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించింది. తను లైఫ్ థ్రెటెనింగ్ లో ఉన్నట్లు ఆర్టికల్స్ ఉన్నాయని.. అవేవీ నిజం కాదని చెప్పింది. తాను ఉన్న స్టేజీ ప్రాణాపాయం మాత్రం కాదని తెలిపింది.

నా ఆరోగ్య పరిస్థితి, నాకున్న వ్యాధి తీవ్రత అనేది కాస్త డిఫికల్ట్ గానే ఉంది. అయినా నేను శక్తి వంచన లేకుండా దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతానికైతే నేను చావలేదు. అలాంటి హెడ్ లైన్స్ అనేవి ఇప్పుడు అప్రస్తుతం అంటూ సమంత ఎమోషనల్ అయింది.

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చిన సమంత.. ఈసారి కూడా ఎప్పటిలాగే తిరిగి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సామ్ చేతిలో ప్రస్తుతం 'ఖుషి' వంటి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 'శాకుంతలం' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆమె తిరిగి కోలుకున్న తర్వాత వివిధ చిత్రాల షూటింగ్స్ ప్రారంభం అవుతాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.