Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వైట్ లో చెన్నై బ్యూటీ మాయ

By:  Tupaki Desk   |   10 May 2016 3:07 PM IST
ఫోటో స్టోరి: వైట్ లో చెన్నై బ్యూటీ మాయ
X
మొదటి సినిమా ఏ మాయ చేశావే లోనే బోలెడన్న లిప్ లాక్స్ చేసేసి, తన రేంజ్ ఏంటో చూపించేసింది సమంత. మూతి ముద్దుల విషయంలో మొహమాటాలు చూపించని ఈ అమ్మడు.. ఇన్నాళ్లు స్కిన్ షో విషయంలో మాత్రం కాసింత పొదుపు పాటించేది. అడపా దడపా తప్పితే క్లీవేజ్ షోల రేంజ్ వరకూ వెళ్లని సమంత.. ఇప్పుడు రూట్ మార్చేసింది.

రీసెంట్ గా విడుదల అయిన 24 లాంటి సినిమాల్లో శామ్స్ ను చూస్తే.. అందాలను చూపించేస్తున్న సమంత కనిపిస్తుంది. శామ్స్ ఇంతగా స్కిన్ షో చేసిన దాఖలాలు గతంలో తక్కువే. మరీ సాంప్రదాయం రేంజ్ లో కాకపోయినా... ఒకరకంగా పద్ధతిగా కనిపించడం సమంత స్పెషాలిటీ. ఇప్పుడీ హద్దులను ఈ చెన్నై సుందరి చెరిపేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాల్లోనే కాదు.. ఫోటో సెషన్లలో కూడా అందాలు ఒలకబోసేస్తూ ఆకట్టుకుంటోంది. సమంత. రీసెంట్ గా ఓ ఫోటో సెషన్ కోసం వైట్ అండ్ వైట్ లో మెరిసిపోయింది సమంత.

అమ్మడిలో ఈ మధ్య గ్లామర్ డోస్ తగ్గుతోందని వస్తున్న విమర్శలకు ఈ ఫోటోలతో ఫుల్లు క్లారిటీ ఇచ్చేసింది. అదోదే స్కిన్ ఎలర్జీ సమంత అందాన్ని చెడగొట్టేసిందనే కామెంట్లకు సమాధానంలా ఉన్నాయి ఈ ఫోటోలు. వైట్ కలర్ డ్రస్ లో సమంత ఇంత అందంగా ఉంటుందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారంటే... ఈ భామలో గ్లామర్ డోస్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్ధమవుతుంది.