Begin typing your search above and press return to search.

రామలక్ష్మి చిలక పలుకులు

By:  Tupaki Desk   |   3 April 2018 9:42 AM GMT
రామలక్ష్మి చిలక పలుకులు
X
టాలీవుడ్ లో హీరొయిన్లకు పెళ్ళైతే వాళ్ళకు వాళ్ళు నటించిన సినిమాలకు ఆదరణ తక్కువగా ఉంటుందనే సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అక్కినేని సమంతా కొత్త ట్రెండ్ సెట్ చేసింది. రంగస్థలం సక్సెస్ లో తనకూ షేర్ ఉండటం పట్ల ప్రస్తుతం భర్త నాగ చైతన్యతో ట్రిప్ లో ఉన్న సామ్ సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే ఉంది. ఈ ఏడాది తన తొలి సినిమా ఇదే కావడం పైగా ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో పడటం పట్ల అక్కడి నుంచే షేర్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఫాన్స్ తో చేసిన ఆన్ లైన్ చాట్ లో కొన్ని ముచ్చట్లు పంచుకున్న సమంతా కొన్ని కొత్త విషయాలు చెప్పింది. తనకు సౌత్ లో సాయి పల్లవి అంటే చాలా ఇష్టమట. ప్రేమమ్ ఫిదాలో తన నటనకు బాగా ఇంప్రెస్ అయిన సమంతా అప్పటి నుంచే తనను లైక్ చేయటం మొదలుపెట్టిందట.

ఒకవేళ తను అబ్బాయిగా మారి ఎవరైనా హీరొయిన్ ని ప్రేమించే అవకాశం దక్కితే ఆలోచించకుండా వెంటనే పద్మవత్ ఫేం దీపికా పదుకునేకు ప్రపోజ్ చేస్తుందట. తనంటే అంత ఇష్టమని చెబుతోంది సాం.సుకుమార్ రంగస్థలంలో తన పాత్ర గురించి చెప్పినప్పుడు అదృష్టంగా భావించానని చెబుతున్న సమంతా రామ్ చరణ్ కు తను పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వడం వల్లే కెమిస్ట్రీ అంత బాగా వచ్చిందని చెప్పేసింది. జీవితంలో ఎక్కువగా గుర్తుపెట్టుకునే రోజు పెళ్లి రోజే అని చెప్పిన సమంతా ప్రస్తుతం భర్తతో కలిసి ఎనిమిదేళ్ళ క్రితం తామిద్దరూ ప్రేమలో పడిన ఏ మాయ చేసావే లొకేషన్ లో పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటోంది. ఇక్కడ సక్సెస్ మీట్ జరుగుతున్న రోజే అక్కడ ట్విట్టర్ ద్వారా తన మెమోరీస్ షేర్ చేసుకుంది.

సమంతా నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి మహానటి కాగా రెండోది విశాల్ అభిమన్యుడు. మహానటి డేట్ మే 9 అని ప్రకటించేసారు. తమిళనాడులో సమ్మె పూర్తయితే కాని అభిమన్యుడు డేట్ బయటికి రాదు. తిరిగి రాగానే కన్నడ రీమేక్ యు టర్న్ షూటింగ్ లో పాల్గొంటుంది సమంతా. అందులో తనకు తోడుగా ఉండి సహాయం చేసే పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నాడు.