Begin typing your search above and press return to search.

అండర్ వేర్ మర్చిపోనంటున్న సమంత

By:  Tupaki Desk   |   13 May 2016 2:08 PM IST
అండర్ వేర్ మర్చిపోనంటున్న సమంత
X
సమంత లాంటి అందమైన హీరోయిన్.. అడగండి చెబుతా అని అభిమానులకు ఆఫర్ ఇస్తే... ఫ్యాన్స్ ఆగుతారా? రకరకాల ప్రశ్నలను సంధించరూ! ట్విట్టర్ లో ఆస్క్ శామ్ క్వశ్చనీర్ లో అదే జరిగింది. అయితే.. అభిమానులు అడిగిన ప్రశ్నల కంటే.. శామ్స్ ఇచ్చిన ఆన్సర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ప్రయాణంలో మర్చిపోలేని మూడు విషయాలేంటి అని అడిగితే.. సమంత ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా.. స్కిన్ కేర్ సామాగ్రి, మెడికేషన్, అండర్ వేర్ అనేసింది శామ్స్. మరిన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్.. క్రిస్ప్ గా..

గతంలో తీసుకున్న నిర్ణయాలు తప్పని ఎప్పుడన్నా అనిపించిందా?
అవును 2012లో..

మహేష్ కూతురు సితారతో ఏం మాట్లాడారు?
తన నెయిల్ పాలిష్ గురించి

ఒకే ఏడాది రెండు అవార్డులొస్తే ఎలా ఫీలవుతారు?
నేను సంతోషించే సందర్భాల్లో అదొకటి

జిమ్ ఆర్ కేఫ్?
అన్ని దారులు జిమ్ కే

మలయాళంలో ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారు?
దుల్కర్

సినిమల్లో నటించడం అదృష్టమా లేక కల నెరవేరిందా?
అదృష్టమే

అట్లీతో మళ్లీ చేస్తారా?
డౌటా,,

బాగా నచ్చిన కలర్
సీజన్ ను బట్టి మారుతుంది

తమిళనాడు కుర్రాళ్లకు సలహా?
పెద్ద కలలు కనండి, సవాళ్లను స్వీకరించండి

బాగా కోపం తెప్పించే ప్రశ్న?
షూటింగ్ స్పాట్ లో ఓ సంఘటన చెప్పమని అడిగితే

బాగా నచ్చిన ఫుడ్?
జపనీస్

చిన్మయి కాకపోతే డబ్బింగ్ అవకాశం ఎవరికి ఇచ్చేవారు?
నేనే చెబుతా

జీవిత లక్ష్యం ఏంటి?
సినిమాల తర్వాత జీవితంలో విజయం సాధించడం

ఏ నటుడితో డ్యాన్స్ అంటే భయపడతారు?
జూనియర్ ఎన్టీఆర్

జీవితంలో బాగా సంతోషంగా ఉన్న సమయం?
ప్రస్తుతం నేను అదే ఫేజ్ లో ఉన్నా..