Begin typing your search above and press return to search.
సింధుగా సమంత.. ఎలా సాధ్యం?
By: Tupaki Desk | 4 Sep 2019 8:13 AM GMTఅక్కినేని వారి కోడలు సమంత.. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు పాత్ర పోషించబోతోందట. ఈ చిత్రాన్ని ఆమె అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందట. ఈ సినిమా చేసి కెరీర్ కు గుడ్ బై చెప్పాలన్నది ఆమె ప్లాన్ అట. కొన్ని రోజులుగా ఈ వార్త హల్ చల్ చేసేస్తోంది టాలీవుడ్ వర్గాల్లో. కానీ నిజంగా సమంత.. సింధుగా నటించే అవకాశం ఉందా? లాజికల్‌గా ఆలోచిస్తే మాత్రం అందుకు అవకాశం లేనట్లే. ఒకవేళ సింధు పాత్రను సమంత చేయాలన్న ఆలోచనతో ఉంటే కూడా ఆమె ఈ పాత్రకు ఏమేరకు ఫిట్ అనేది ఆలోచించాల్సిన విషయం.
సింధుగా సమంత అనగానే.. ఇద్దరి రూపాల్లో పోలికలు ఏమేర ఉన్నాయన్న ప్రశ్న తలెత్తుతుంది. సింధు మహా పొడగరి. ఆరడుగుల ఎత్తుంటుంది. సమంత చూస్తే పొట్టి అమ్మాయి. ఐడుగులకు కాస్త ఎక్కువ పొడవుంటుంది. ఇద్దరి ముఖ కవళికల్లోనూ పెద్దగా పోలికలు కనిపించవు. బయోపిక్ అన్నాక రూపం విషయం ప్రధాన పాత్రకు దగ్గరగా ఉన్నవాళ్లే ఉండాలని ఎవ్వరైనా ఆశిస్తారు. అలాంటపుడు సింధుతో అసలు పోలికలే లేని సమంతను పెడితే రాంగ్ ఛాయిస్ అవుతుంది. దీనికి తోడు 24 ఏళ్ల సింధు పాత్రలో 32 ఏళ్ల వయసుండి.. పెళ్లి కూడా చేసుకుని సీనియర్ ట్యాగ్ వేయించుకున్న సమంత ఎలా ఫిట్ అవుతుందని అనుకుంటాం. కాస్త యంగ్ గా కనిపించే అమ్మాయి ఎవరైనా ఈ పాత్రలో ఉంటేనే బాగుంటుంది.
ఇంకో ముఖ్యమైన విషయం.. సింధు నేషనల్ ఫిగర్. ఆమెపై తీసే సినిమాను కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలనుకుంటారు. ఈ సినిమాను నిర్మించబోయేది కూడా బాలీవుడ్ నటుడైన సోనూ సూద్. అలాంటపుడు ఏ బాలీవుడ్ హీరోయిన్నో పెట్టుకో.. సౌత్ లో మాత్రమే పాపులర్ అయిన సమంతను ఎంచుకుంటాడా? ఇలా సమంత.. సింధు పాత్రలో నటించదు అనడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. మరి ఆమె ఆ సినిమాలో నటించబోతోందని ఎందుకింత ప్రచారం జరుగుతోందో?