Begin typing your search above and press return to search.

'తప్పు చేసినా చేయకపోయినా నీదే బాధ్యత'.. ఇన్స్టాలో సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

By:  Tupaki Desk   |   22 July 2022 2:05 PM GMT
తప్పు చేసినా చేయకపోయినా నీదే బాధ్యత.. ఇన్స్టాలో సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
X
దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరైన సమంత రూత్ ప్రభు ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నాలుగేళ్ళ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వీరి వ్యక్తిగత జీవితం గురించి రోజూ ఏదొక వార్త వస్తూనే ఉంది.

నిజానికి విడాకులపై ఇప్పటికే వీరిద్దరూ స్పందించారు. 'బంగార్రాజు' ప్రమోషన్స్ లో చైతన్య స్పందిస్తూ తను హ్యాపీగా ఉంది.. సో నేను కూడా హ్యాపీ అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంటూ వస్తున్నాడు. సామ్ మాత్రం విడిపోయిన తర్వాత పరోక్షంగా తన లైఫ్ లో జరిగిన వ్యవహారం గురించి సోషల్ మీడియాలో 'అమ్మ చెప్పింది' అంటూ తరచుగా కొటేషన్స్ షేర్ చేస్తూ వచ్చింది. ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడింది.

లేటెస్టుగా 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో విడాకుల పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. మీ భర్త నుంచి విడిపోఎప్పుడు మీ మైండ్ స్టేటస్ ఏంటి అని కరణ్ ప్రశ్నించగా.. 'భర్త కాదు.. మాజీ భర్త' అని ఘాటుగా స్పందించింది. ఇంకా హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా? అని అడగ్గా.. మీరు మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది.. ప్రస్తుతం అలా ఉంది అని సమంత వ్యాఖ్యానించింది.

కరణ్ షోలో చైతూ తో విడాకుల పై సమంత స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో ఓ వర్గం ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నాగచైతన్య ఎంతో మెచ్యూర్ గా వ్యవహరిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటే.. సామ్ మాత్రం వీలుచిక్కినప్పుడల్లా అతన్ని టార్గెట్ చేసేలా మాట్లాడుతోందని అభిప్రాయ పడుతున్నారు. ఆమెదే తప్పు అన్నట్లుగా కామెంట్స్ పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో సమంత లేటెస్టుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 'నువ్వు తప్పు చేసినా నీదే బాధ్యత.. తప్పు చేయకపోయినా నీదే బాధ్యత' అంటూ ఆధ్యాత్మిక గురు జగ్గీ వాసుదేవ్ చెప్పిన ఓ కొటేషన్ ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సామ్. ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న చర్చను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టిందని స్పష్టంగా తెలుస్తుంది. దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇటీవల నాగచైతన్య డేటింగ్ రూమర్స్ వెనుక సామ్ ఉందని ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు కౌంటర్ ఇస్తూ.. ''అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే. అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయించింది. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. నిజానికి అందులో ప్రమేయం ఉన్న పార్టీలు మూవ్ ఆన్ అయిపోయారు. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీ పని మీద, మీ కుటుంబాల మీద దృష్టి పెట్టండి'' అని సమంత ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, 'ఏమాయ చేసావే' సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య - సమంత.. ఈ క్రమంలో ప్రేమించుకొని 2017లో వివాహం చేసుకున్నారు. నాలుగో యానివర్సరీ రాకముందే 2021 అక్టోబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.