Begin typing your search above and press return to search.
ఆడవారి సమస్యల పై సమంత ఆసక్తికర పోస్ట్
By: Tupaki Desk | 19 Sept 2020 11:04 PM ISTమహిళ సాధికారత గురించి సమంత సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక విషం షేర్ చేస్తూనే ఉంటుంది. ఒక వివాహితగా హీరోయిన్ గానే కాకుండా ఒక సాదారణ అమ్మాయిగా గృహిణిగా కూడా సమంత ఆలోచిస్తూ తన తోడి ఆడవారి సమస్యల గురించి పలు సందర్బాల్లో ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను మాత్రమే కాకుండా ఇతన ఆడవారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమె రెగ్యులర్ గా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఆడవారు బాధపడుతున్న సమస్య గురించి స్పందించింది. ఆడవారు ఎన్నో విషయాల్లో తమను తాము ప్రశ్నించుకుంటూ ఉంటారు. మహిళలు ఆలోచన చేసే విధంగా సమంత పోస్ట్ చేసింది.
అన్ని రంగంలోని మహిళలు ఎప్పుడు కొన్ని ప్రశ్నలు వారికి వారు వేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. మహిళలు మాత్రమే ఈ ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ తప్పుకు నేనే కారణమా? నేనే ఇంత బరువు ఉండకూడదేమో? నేను వారిని చూడకుండా ఉండాలా? నేను ఈ జాబ్ కు సరిపోతానా? నేను అతడికి సరిపోతానా? నా గురించి జనాలు ఏమనుకుంటున్నారో? నా డ్రస్ మరీ చిన్నగా అయ్యిందా? అర్థరాత్రి సమయంలో నేను ఇంటికి పోగలనా? నా అందం గురించి ఎవరు ఏమనుకుంటున్నారో? అంటూ ఇన్ని ప్రశ్నలు ప్రతి ఒక్క అమ్మాయిని వేదిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన చుట్టు ఉన్న వారు ఇలాంటి వాటినే ఎక్కువగా చెబుతూ ఉంటారు అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రతి అమ్మాయిలు ఈ ప్రశ్నలన్నింటిని వదిలేసే రోజు రావాలంటూ సమంత పోస్ట్ కు ఎంతో మంది కామెంట్స్ పెట్టారు.