Begin typing your search above and press return to search.

అక్కినేని కోడ‌లు గ్లో వెన‌క ఇదీ ర‌హ‌స్యం

By:  Tupaki Desk   |   22 Aug 2021 4:30 PM GMT
అక్కినేని కోడ‌లు గ్లో వెన‌క ఇదీ ర‌హ‌స్యం
X
స‌మంత ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి తెలిసిందే. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార విధానంతో పాటు నిరంత‌రం జిమ్ లో శారీర‌క శ్ర‌మ‌ను విధిగా అనుస‌రిస్తుంది. అంతేకాదు క‌ఠిన శ్ర‌మ‌కు త‌గ్గ‌ట్టే ఆహారాన్ని ప్లాన్ చేస్తుంది. ఇక పండ్ల ర‌సాలను విర‌విగా తీసుకుంటుంద‌ని త‌న దిన‌చ‌ర్య చెబుతోంది. తాజాగా సామ్ అలా ఆరెంజ్ జూస్ సేవిస్తూ క‌నిపించిన ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటో చూడగానే సామ్ గ్లో వెన‌క సీక్రెట్ ఇదా? అంటూ యూత్ ఒక‌టే ఆశ్చ‌ర్య‌పోతోంది.

అయితే ఇది మాత్ర‌మే అనుస‌రిస్తే స‌రిపోతుందా? స‌మ‌తులాహార నియ‌మం ఎలా పాటించాలో సామ్ త‌న‌దైన శైలిలో వెల్ల‌డించింది. ఇప్పుడున్న కాలుష్యంలో అందాన్ని కాపాడుకోవ‌డం అంత సులువేమీ కాదు. అందాన్ని కాపాడుకునేందుకు చ‌క్క‌ని చిట్కాలు ఉన్నాయ‌ని అక్కినేని కోడ‌లు స‌మంత చెబుతున్నారు. అంతేకాదు బుగ్గ‌ల‌పై ముఖంలో నునులేత అందం త‌రిగిపోకుండా ఉండాలంటే పాల‌కూర బ‌చ్చ‌లి కూర తినాల‌ని తెలిపారు సామ్.

అందం ఆరోగ్యం ఫిట్నెస్ పై ఎన్నో టిప్స్ చెబుతున్న సామ్ .. ఇస్తున్న తాజా టిప్ యువ‌త‌రానికి బాగా న‌చ్చేసేదే. పైగా ఉద‌యం పూట ఆహారంతోనే స‌గం స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చెబుతున్నారు సామ్. ఉదయం అల్పాహారంగా సమంతా పాలకూర.. బచ్చలికూర .. సెలెరీ స్మూతీని తీసుకుంటుంది. దీనివ‌ల్ల‌ కొల్లాజెన్ చెక్కుచెదరకుండా ఉంటుంది. నటి తన ఫిట్నెస్ ఇంటర్వ్యూలలో కొల్లాజెన్ ప్రాముఖ్యతను చాలాసార్లు వెల్ల‌డించారు. మచ్చలేని చర్మం కలిగి ఉండటానికి చాలా కూరగాయలు .. ఆకుకూర‌లు.. పండ్లు.. కాయలు.. తీసుకుంటారు. ఆల్గే మాస్క్ లు కోల్డ్ ప్రెస్డ్ డ్రింక్స్ చాలా ముఖ్యమైనవి.

యోగాస‌నాల‌తో పాటు సూర్య న‌మ‌స్కారాల్ని ప్రతి రోజు అనుస‌రిస్తారు. సూర్య న‌మ‌స్కారాలు గ‌రిష్టంగా 108 సార్లు చేస్తారు. ఆమె ఇషా క్రియా ప్రయాణం 48 రోజుల యోగా దినచర్యను కూడా అనుసరించారు. ఇది చర్మం ఆరోగ్యం.. మెరుపుపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. మ‌చ్చలేని స్కిన్ సాన్స్ మేకప్ ఉప‌యోగించ‌డ‌మే కాదు... సమంతా తన చర్మ దినచర్యను వెల్ల‌డించారు. వారానికి కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయాలి. కఠినమైన-రసాయన ఉత్పత్తులకు దూరంగా ఆహారం సేక‌రించాలి. సేంద్రీయ చర్మ సంరక్షణ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. షూట్ కోసం ప్రయాణించేటప్పుడు ఒక‌టికి రెండు సార్లు ముఖానికి టోన్ చేస్తుండ‌డం అవ‌స‌రం. అలాగే సామ్ వీట్ ‌గ్రాస్ ట్రీట్మెంట్ ని ప్రస్థావించారు. మ్యాజిక్ పానీయాలను కూడా సమయానికి తీసుకోవాల‌ని వెల్ల‌డించారు. సామ్ టిప్స్ ని మీరూ ఫాలో అయితే అంత‌టి గ్లో మీ సొంత‌మవుతుంది మ‌రి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... సమంత అక్కినేని తదుప‌రి పౌరాణిక చిత్రం శాకుంతలంలో కనిపించ‌నుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ తో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. ఈ చిత్రం మహాకవి కాళిదాసు రాసిన `అభిజ్ఞాన శాకుంతలం` అనే ప్రాచీన నాటకం ఆధారంగా రూపొందించిన‌ది. అల్లు అర్జున్ కుమార్తె అర్హ .. క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.