Begin typing your search above and press return to search.
'యశోద' ప్రచారానికి సామ్ దూరం..అతి పెద్ద మైనస్!
By: Tupaki Desk | 5 Nov 2022 11:58 AM GMTసమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'యశోద' భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యూనిట్ ప్ర చారం పనుల్ని వేగవంతం చేసింది. సినిమాలో నటీనటుల్ని అందర్నీ ప్రచారంలో భాగంగా వినియోగించుకుటుంది. కీలక పాత్రలంతా ఇతర భాష నటులు అయినా! ప్రచారానికి సహకరిస్తున్నారు. సినిమా ప్రచారంతో పాటు వ్యక్తిగత ఇంటర్వ్యూల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.
ఇప్పటికే సినిమాకి సంబంధించి వరలక్ష్మి..ఉన్ని ముకుందన్ సహా పలువురు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంకా రిలీజ్ కి వారం సమయం ఉన్న నేపథ్యంలో మరింత మంది నటులు..సాంకేతిక నిపుణుల్ని సైతం తెర మీదకు తెచ్చే అవకాశం ఉంది. అ యితే ప్రధాన పాత్ర దారి సమంత మాత్రం 'యశోద' ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే.
ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడటంతో చికిత్సలో ఉంది. ఎన్ని రోజుల పాటు చికిత్స అందించాల్సి ఉంటుందన్నది క్లారిటీ లేదు. అటుపై విశ్రాంతి అంతే అవసరం. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదని సూచనలిచ్చారు. సమంత కూడా అంతే విధిగా ఉంది. 'యశోద' షూటింగ్ సమయంలోనే జబ్బు బారిన పడినా చిత్రీకరణకు ఎలాంటి ఆటకం కలగకూడదని భావించి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
షూట్ పూర్తయిన తర్వాత ఇన్ స్టార్ ద్వారా రివీల్ చేసి అందర్నీ మనసులు కలిచి వేసింది. ఈ విషయంలో 'యశోద' టీమ్ ఎంతో చింతిస్తోంది. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సినిమా కోసం పనిచేసిన గొప్ప నటి అని కీర్తిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రచారంలో సమంత పాల్గొనకపోవడం అన్నది సినిమాకి అతి పెద్ద మైనస్ గా కనిపిస్తోంది.
ఎంతమంది నటులు రిలీజ్ కి ముందు బూస్టింగ్ ఇచ్చినా సమంత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సమంత ద్వారా సినిమాకి సంబంధించిన విషయాలు జనాల్లోకి వెళ్తే ఆ రీచ్ మరోలా ఉంటుంది. ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి సామ్ అప్పీరియన్స్ పనికొచ్చేది. కంటెంట్ పరంగా సినిమా హైలైట్ అవుతోంది. అద్దె గర్భం అనే కాన్సెప్ట్ తో తెలుగులో వస్తోన్న తొలి చిత్రమిది.
సమజాన్ని ప్రశ్నించేలా ఉండబోతుందని తెలుస్తోంది. ఇలాంటి సినిమా గురించి సమంత నేరుగా కొన్ని వ్యాఖ్యలైనా చెప్పగలిగితే జనాలకి మరింత కనెక్ట్ అయ్యేది. కానీ ఆ ఛాన్స్ ఏమాత్రం లేదు. మరి సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పోస్ట్ అయినా పెడుతుందా? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.