Begin typing your search above and press return to search.

ఓవైపు ఉత్తమ నటిగా అవార్డు.. మరోవైపు ప్రతిష్టాత్మక లిస్ట్ లో చోటు..!

By:  Tupaki Desk   |   10 Nov 2021 10:32 AM GMT
ఓవైపు ఉత్తమ నటిగా అవార్డు.. మరోవైపు ప్రతిష్టాత్మక లిస్ట్ లో చోటు..!
X
అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు గత దశాబ్దకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. పెళ్లి తర్వాత కూడా సినీ కెరీర్ ని విడిచిపెట్టని సామ్.. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టింది. ఇక భర్త అక్కినేని నాగచైతన్య తో విడిపోతున్నట్లు ప్రకటించిన అనంతరం వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తోంది. అయితే లేటెస్టుగా సమంత ఓ అరుదైన ఘనత సాధించింది. ఎఫ్‌సి (ఫిల్మ్ కంపానియన్) డిస్ట్రప్టర్-2021 జాబితాలో ఆమె చోటుదక్కించుకుంది. ఎఫ్‌సీ టాప్-20 లిస్ట్‌ లో సామ్ 8వ స్థానంలో నిలిచింది.

''రంగస్థలం - యు టర్న్ మరియు సూపర్ డీలక్స్ వంటి చిత్రాల్లో సమంత రూత్ ప్రభు నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆమె జనతా గ్యారేజ్ - బ్రహ్మోత్సవం - థేరి - మెర్సల్ వంటి మరికొన్ని అతి పెద్ద సౌత్ చిత్రాలలో భాగమైంది. అయితే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ద్వారా సమంత హిందీ అరంగేట్రం చేయడం.. ఈ సిరీస్ భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆమెను ఇంస్టెంట్ నేషనల్ స్టార్ గా మార్చింది. మేల్ స్టార్స్ ఆధిపత్యం చెలాయించే తెలుగు పరిశ్రమలో, సమంత ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' వంటి పౌరాణిక పాన్ ఇండియన్ చిత్రాన్ని భుజానకెత్తుకుంది. ఆమె నేషనల్ అప్పీల్ ఉన్న నటిగా కీర్తికి పొందుతున్నందుకు ధన్యవాదాలు'' ఫిల్మ్ కంపానియన్ పేర్కొంది.

ఇకపోతే 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌ గాను సమంత ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2021 (ఐఐఎఫ్‌ఎం) అవార్డును కూడా కైవసం చేసుకుంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫిమేల్ (సిరీస్) కేటగిరీలో సామ్ ఈ అవార్డుకు ఎంపికైంది. ఇందులో లీడ్ రోల్ ప్లే చేసిన విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కు బెస్ట్ పెరఫార్మన్స్ మేల్ (సిరీస్) కేటగిరీలో అవార్డ్ దక్కింది.

కాగా, దర్శకద్వయం రాజ్ నిడిమోరు - కృష్ణ డీకే రూపొందించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. లైంగిక వివక్షకు గురైన రాజీ అలియాస్‌ రాజ్యలక్ష్మి అనే తమిళ ఈలం సోల్జర్ పాత్రలో సామ్ అద్భుతంగా నటించిన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డీ గ్లామర్ లుక్ లో యాక్షన్ సీన్స్ తో పాటుగా బోల్డ్ సన్నివేశాల్లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో సమంత ను ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి.