Begin typing your search above and press return to search.
సమంతది విలన్ పాత్ర కాదట
By: Tupaki Desk | 16 May 2021 5:00 PM ISTడిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తొలి అడుగును సక్సెస్ ఫుల్ గా వేసింది సమంత. ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ తొలి సీజన్‌కు గత ఏడాది డిజిటల్ ఎంటర్‌టైన్ మీడియమ్‌లో మంచి ఆదరణ లభించింది. తొలి సీజన్‌లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, షరీబ్ హష్మీ, నీరజ్ మాధవ్‌లు కీలక పాత్ర పోషించారు. రెండో సీజన్‌లో సమంత ఓ లీడ్ చేశారు. త్వరలో ఈ సీరిస్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపధ్యంలో ఆమె ఈ సీరిస్ లో విలన్ గా కనిపించనుందంటూ మీడియాలో గత కొంతకాలగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయమై రాజ్ అండ్ డీకే క్లారిటీ ఇచ్చారు.
రాజ్ అండ్ డీకే మాట్లాడుతూ...‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్‌లో సమంతను తీసుకోవడానికి కారణం ఉంది. ఆమె క్యారెక్టర్‌లో కొన్ని షేడ్స్ ఉంటాయి. స్ట్రాంగ్ క్యారెక్టర్... సమంతది విలన్ పాత్ర అని చెప్పలేం కానీ మనోజ్ బాజ్‌పాయ్‌కి అపోజిట్ క్యారెక్టర్. జూన్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే వెబ్ సిరీస్ ట్రైలర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నాం. ఆ ట్రైలర్‌లో సమంత పాత్ర గురించి మరింత తెలుస్తుంది అన్నారు.
సమంత మాట్లాడుతూ– ‘‘ది ఫ్యామిలీమేన్’ సీజన్ 2’ షూటింగ్‌కి సంబంధించిన ఏ రోజునీ నేను మర్చిపోలేను. ఇదివరకు నేను వెండితెరపై నటించిన పాత్రలకు ఇది పూర్తి విభిన్నమైనది.’’ అన్నారు.
త్వరలోనే ఓటీటీ వేదికగా అన్ని ప్రాంతీయ భాషల్లో సందడి చేయనున్న ఈ సీరిస్ కోసం సామ్ తొలిసారి ఓ కొత్త ప్రయత్నం చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్ కోసం హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందిట సామ్. అందుకు తగ్గట్లుగా హిందీలో తన ప్రావీణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఈ సిరీస్‌లో తీవ్రవాదిగా కనిపించనున్నట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.