Begin typing your search above and press return to search.
మనోహరి రేంజులో సామ్ తో వర్కవుటయ్యేనా?
By: Tupaki Desk | 16 Nov 2021 4:33 AM GMTఅగ్ర కథానాయికలు ఐటమ్ భామలుగా మారడం అన్నది ఇప్పటిది కాదు. కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే రెగ్యులర్ ఐటమ్ గాళ్స్ తో పోలిస్తే వీళ్లను ఒప్పించేందుకు భారీ పారితోషికం సమర్పించుకోవాల్సి ఉంటుంది. డబ్బుతో సాధ్యమయ్యేవి కొన్ని ఉన్నాయి ఈ రంగుల ప్రపంచంలో..! ఇప్పుడు అదే ఫ్యాక్టర్ మరో అగ్ర కథానాయిక స్పెషల్ నంబర్ కి అంగీకరించేందుకు కారణమైంది! అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
గత కొద్దిరోజులుగా సుకుమార్ బృందం `పుష్ప- ది రైజ్` లో ఐటమ్ నంబర్ కోసం ప్రముఖ కథానాయిక సమంతను సంప్రదించిందని గుసగుసలు వినిపించాయి. తాజా సమాచారం మేరకు ఈ స్పెషల్ నంబర్ కి సమంత అంగీకరించారని తెలిసింది. సుకుమార్ కాంబినేషన్ లో ఇంతకుముందు రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించిన సమంత ఇప్పుడు తనతో ఉన్న చక్కని సత్సంబంధాల కారణంగా ఐటమ్ పాటకు అంగీకరించారని అంతా భావిస్తున్నారు.
చక్కని సత్సంబంధాలతో పాటు భారీ పారితోషికాన్ని సామ్ కి ముట్టజెబుతున్నారని ఇప్పుడు మరోసారి లీకు అందింది. ఐటమ్ పాట కోసం ఏకంగా 1.75 కోట్లు సమంతకు అందుతోందట. అదనంగా పన్నులు కూడా నిర్మాత చెల్లించాల్సి ఉంటుంది. అంటే సామ్ ఐటమ్ పాట రూపంలోనే 2కోట్లు నిర్మాతలు ఖర్చు చేస్తున్నారన్నమాట. ఈ పాట కోసం ప్రత్యేకించి సెట్ డిజైన్లు చేయాల్సి ఉంటుంది. పెళ్లి తర్వాత సమంత కు ఇదే తొలి ఐటమ్ నంబర్.
సుకుమార్ సినిమాల్లో ఐటమ్ నంబర్ అంటే దేవీశ్రీ మ్యూజిక్ ఏ రేంజులో వర్కవుట్ అవుతోందో చెప్పాల్సిన పని లేదు. నోరా ఫతేహి లాంటి టాప్ రేంజ్ ఐటమ్ గాళ్ చేయాల్సిన పాటలో సమంత నర్తించాల్సి ఉంటుంది. అంటే తనలోని గ్లామర్ యాంగిల్ తో పాటు అద్భుత నృత్య ప్రతిభను వెలికి తీస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. నోరా ఫతేహి రేంజులో సామ్ వర్కవుట్ చేస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి.