Begin typing your search above and press return to search.

అల్ల‌రి అల్లు అర్హ భ‌విష్య‌త్ పై సామ్ జోశ్యం

By:  Tupaki Desk   |   21 Oct 2021 3:42 AM GMT
అల్ల‌రి అల్లు అర్హ భ‌విష్య‌త్ పై సామ్ జోశ్యం
X
నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట విడాకులు తీసుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాము విడిపోతున్నామంటూ చై - సామ్ ప్ర‌క‌టించి దాదాపు 20 రోజులు కావ‌స్తున్నా ఇప్ప‌టికీ వీరిద్ద‌రు వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇదిలా వుంటే తాజాగా త‌న స్నేహితురాలితో క‌లిసి ప్ర‌త్యేకంగా డెహ్రాడూన్ లో విహారానికి వెళ్లిన స‌మంత తాజాగా ఓ స్టార్ కిడ్ పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ఆ కిడ్ ఒక‌ రాక్ స్టార్ అని.. పుట్ట‌డ‌మే రాక్ స్టార్ గా పుట్టింద‌ని స్టార్ కిడ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. అంతే కాకుండా ఆమె ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో కూడా సామ్ చెప్పారు. సామ్ ని అంత‌గా ఇంప్రెస్ చేసిన ఆ స్టార్ కిడ్ మ‌రెవ‌రో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ‌. స‌మంత న‌టిస్తున్న `శాకుంత‌లం` చిత్రంతో అల్లు అర్హ వెండితెర‌కు బాల‌న‌టిగా ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. అర్హ‌పై చిత్రీక‌ర‌ణ స‌హా శాకుంత‌లం టాకీ చిత్ర‌ణ‌ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్హ న‌ట‌న‌కు ముగ్ధురాలైన సామ్ త‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

`అల్లు అర్హ జ‌న్మతః రాక్ స్టార్ గా పుట్టింద‌ని..త‌న తొలి స్టెప్ లోనే మంచి మార్గాన్ని ఎంచుకుంద‌ని.. అలాంటి అర్హ నా సినిమా ద్వారా న‌టిగా ప‌రిచ‌యం అవుతున్నందుకు ఆనందంగా వుంద‌ని.. భ‌విష్య‌త్తులో అల్లు అర్హ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఏలుతుంద‌ని స్టార్ కిడ్ ఫ్యూచ‌ర్ ని చెప్పేసింది సామ్‌. `శాకుంత‌లం`లో అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడిగా క‌నిపించ‌బోతోంది. ఇప్ప‌టికే త‌న‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తి చేశారు. చిత్రీక‌ర‌ణ సంద‌ర్భంగా అల్లు అర్జున్‌- స్నేహారెడ్డి సెట్ లో సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

క్రేజీ మూవీతో ఎంట్రీ ఇస్తున్న అర్హ‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌వార‌సురాలు అల్లు అర్హ బాల న‌టిగా తెరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీలో ఎంద‌రినో బాల‌న‌టులుగా ప‌రిచ‌యం చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు గుణ‌శేఖ‌ర్ అర్హ‌ను కూడా తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. అతడు తెర‌కెక్కిస్తున్న శాకుంత‌లం చిత్రంలో క్యూట్ అర్హ బాల‌న‌టిగా మెర‌వ‌నుంది. ఇప్ప‌టికే అర్హ పై పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. వారం ప‌దిరోజుల పాటు అర్హ‌పై చిత్రీక‌ర‌ణ సాగింది. శాకుంతలం బృందం అర్హకు అలంకరించిన సెట్లు బెలూన్ల మెరుపుల న‌డుమ‌ ఘ‌న‌స్వాగతం పలికగా తొలి రోజు చిత్రీక‌ర‌ణ‌కు బ‌న్ని -స్నేహ వ‌చ్చారు. అక్క‌డ అల్లు అర్జున్ ఫాల్క‌న్ నే దించేశారు. అర్హ‌కు ఎలాంటి క‌ష్టం లేకుండా `ఫాల్క‌న్ బ‌స్`ని ఏర్పాటు చేయ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వచ్చింది.

వారంరోజుల్లోనే అర్హ పై చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు గుణ‌. వీడ్కోలు ప‌లికే స‌మ‌యంలో త‌న‌కు స్వాగ‌తం ప‌లికిన‌ప్పుడు చేసిన సందడే మ‌రోసారి క‌నిపించింది. బెలూన్లు .. మెరుపులు మిరుమిట్ల న‌డుమ‌ నిలబడి ఉన్న‌ అర్హ కేక్ లను కత్తిరించింది. త‌న‌తో పాటు డాడీ అల్లు అర్జున్.. మామ్ స్నేహ కూడా ఉన్నారు. అల్ల‌రి అర్హ కెమెరాల‌కు ఫోజులిచ్చి ఛీర్ చేసిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. త‌న‌కు ఘ‌న‌మైన ఆరంగేట్ర‌మిది. ఆ ఆనందం అల్లు కుటుంబంలో స్పష్ఠంగా క‌నిపించింది. శాకుంత‌లంలో అర్హ న‌టిస్తోంది అన‌గానే బ‌న్ని ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకున్నారు. త‌న‌ని పెద్ద తెర‌పై చూడాల‌ని ఎంతో ముచ్చ‌ట‌ప‌డ్డారు. స‌మంత టైటిల్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో అర్హ పాత్ర ఎలా ఉంటుంది? అంటూ ఆరాలు తీసారు. `ప్రిన్స్ భరత్` అనే పాత్ర‌లో ఎంతో క్యూట్ గా అర్హ‌ అల‌రిస్తుంద‌ని తెలిసింది. మొద‌టి సినిమాతోనే ఇంప్రెష‌న్ కొట్టేసిన అర్హ బాల న‌టిగా మ‌రిన్ని సినిమాల‌తో బిజీ అవుతుంద‌నే అభిమానులు ఆశిస్తున్నారు.

పురు రాజవంశం రాజు దుష్యంతుల జీవితం ఆధారంగా రూపొందుతున్న పౌరాణిక డ్రామా శాకుంత‌లం. స‌మంత‌తో పాటు మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్టంతగా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.