Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ః 10 దాటినా మత్తు వదలని సమంత

By:  Tupaki Desk   |   21 March 2021 1:22 PM GMT
పిక్‌ టాక్‌ః 10 దాటినా మత్తు వదలని సమంత
X
సెలబ్రెటీల లైఫ్‌ ఏంటీ ఎంజాయ్ చేస్తారు. వారు జీవితాన్ని ఫుల్‌ గా అనుభవిస్తూ ఉంటారని అనుకుంటాం. కాని చాలా మంది సెలబ్రెటీలు కనీసం తీరిక లేకుండా గడిపేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా బిజీబిజగా గడిపేస్తారు. తెల్లవారక ముందే లేచి వర్కౌట్స్ స్టార్ట్‌ చేసి షూటింగ్ కు వెళ్తారు. బిజీ గా ఉండే స్టార్స్‌ వారంలో ఒక్క రోజు అన్నట్లుగా ఆదివారం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు ఆ ఆదివారం కూడా వర్క్‌ చేయాల్సి ఉంటుంది. సమంత రెగ్యులర్‌ గా వర్కౌట్‌ లు చేయడంతో పాటు ఏదో ఒక పనితో బిజీ బిజీగా ఉంటుంది.

నేడు ఆది వారం అవ్వడంతో సమంత మొద్దు నిద్రపోతూ ఉంది. వీకెండ్‌ అవ్వడంతో నిన్న రాత్రి పొద్దుపోయే వరకు స్నేహితులతో ఎంజాయ్ చేసిందేమో ఆదివారం ఉదయం పది గంటలు దాటినా కూడా నిద్ర లేవలేదు. పది దాటినా కూడా ఇంకా నిద్ర మత్తుగానే ఉంది అంటూ సమంత స్వయంగా తన సోషల్‌ మీడియా స్టోరీలో షేర్‌ చేసింది. సమంత షేర్ చేసిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండ్డింగ్ లో ఉంది. సమంత పెళ్లి తర్వాత మరీ ఇంత సమయం ఎలా పడుకుంటావు.. ఎన్ని పనులు ఉంటాయి చైతూకు టిఫిన్ ఎవరు చేసి పెడతారు అంటూ కొందరు సరదాగా కామెంట్‌ చేస్తే మరి కొందరు మాత్రం ఎంజాయ్ ది సండే అన్నట్లుగా కామెంట్‌ చేస్తున్నారు.