Begin typing your search above and press return to search.
సమంత నేర్చుకున్న కొత్త పాఠాలు
By: Tupaki Desk | 2 May 2017 4:52 AM GMTబాహుబలి2 మూవీ చూసి ఇప్పటికే బోలెడు మంది ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. రాజమౌళి సృష్టించిన చిత్ర రాజాన్ని చూసేందుకు ఇంకా కోట్లాది మంది ఉత్సాహంగా ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు బాహుబలి2 సునామీ కంటిన్యూ కానుంది. అందరూ ఈ సినిమాలోని అద్భుతాలను చూస్తుంటే.. టాలీవుడ్ బ్యూటీ సమంత మాత్రం.. పెన్ను పేపరు తీసుకుని పాఠాలు నేర్చుకుందట.
రాజమౌళి స్కూల్ లో నేను నేర్చుకున్న పాఠాలు అంటూ ఓ లిస్ట్ తయారు చేసింది సామ్స్. 'ఇప్పటికే దేశంలో అతి పెద్ద మూవీ అనే టైటిల్ ని బ్యాక్ లో వేసుకోగా.. నేను విన్నవాటి నుంచి ఈ నోట్స్ రాసుకున్నాను. 1. ఏ వ్యక్తి పాయింట్ కూడా చిన్నది కాదు. మొదటి భాగంలోని ప్రతీ సమాధానంలేని ప్రశ్నకు.. రెండో భాగంలో అద్భుతమైన జవాబు లభించింది. 2. ఈ టీంను ఆన్ స్క్రీన్.. ఆఫ్ స్క్రీన్ లలో చూసినపుడు.. ఒకరిపై ఒకరు బుల్లెట్ గురిపెట్టినట్లుగా అనిపించింది. కలిసి పని చేసి సాధించారు. బాధ.. కష్టం.. మంచి చెడు అన్నీ కలిసి పంచుకున్నారు. ఐకమత్యానికి వీరు నిదర్శనం' అని చెప్పింది సమంత.
'3. ఓటమి అనేది ఎప్పుడు నా ఆప్షన్ కాదు కాబట్టి.. నాకు ఫెయిల్ అడం తెలీదు. ఎపిక్ అనే పదానికి కొత్త అర్ధం చెప్పిన బాహుబలి టీంకు థ్యాంక్యూ' అంటూ తను నేర్చుకున్న పాఠాలను వివరించింది సమంత.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/