Begin typing your search above and press return to search.
సామ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్
By: Tupaki Desk | 27 July 2018 4:58 AM GMTఒక సినిమాకి ఇంకో సినిమాతో పోలిక లేకుండా జాగ్రత్తపడడం అంటే ఆషామాషీనా? ఎంచుకునే పాత్ర పరంగా అలాంటి వైవిధ్యం చూపడం కొందరికే సాధ్యం. స్టార్ హీరోయిన్లలో ఈ వైవిధ్యాన్ని తూ.చ తప్పక పాటిస్తున్న నాయిక సమంత మాత్రమేనని చెప్పాలి. రంగస్థలం రామలక్ష్మిగా - మహానటి మధురవాణిగా ఎంతటి విలక్షణత చూపించిందో అంతకుమించిన విలక్షణ పాత్రల్ని ఇప్పటికీ ఎంచుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. రంగస్థలంలో గోదారి రఫ్ గాళ్ గా అద్భుతమైన ఆహార్యంతో కట్టిపడేసిన సామ్ - ఆ వెంటనే పాతకాలం జర్నలిస్టు మధురవాణిగా మహానటి చిత్రంలో నటించిన తీరు మెస్మరైజ్ చేసింది. అటుపై యూటర్న్ చిత్రంలో అల్ట్రా మోడ్రన్ జర్నలిస్టుగా నటిస్తోంది. ఈ పాత్ర లుక్ ఇటీవలే రిలీజై ఆకట్టుకుంది.
వరుసగా జర్నలిస్టు పాత్రలు పోషించిన సమంత రూటు మార్చి తమిళంలో మరో ప్రయోగాత్మక పాత్రలో నటిస్తోంది. శివకార్తికేయన్ సీమరాజా చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ క్వీన్ గా కనిపించనుంది. ఈ సినిమా నుంచి ఓ పాటను నిన్ననే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో `శిలంబం` అనే ప్రత్యేక మార్షల్ ఆర్ట్స్ టీచర్ గా సమంత నటించింది. తన పాత్ర పేరు సుథంతిర దేవి. మార్షల్ ఆర్ట్స్ లో మతిచెడే షాట్స్ ని సామ్ పై తెరకెక్కించారట. అయితే మార్షల్ ఆర్ట్స్ అంటే రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి కొన్ని వారాల పాటు సామ్ శిలంబం విద్యలో శిక్షణ తీసుకుందిట. సెప్టెంబర్ 13న సీమరాజా తమిళ్ - తెలుగులో రిలీజ్ కానుంది. సామ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం ఏపాటిదో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.