Begin typing your search above and press return to search.

మాటలకీ చేతలకీ పొంతనేది స్యామ్‌??

By:  Tupaki Desk   |   25 Aug 2015 3:57 AM GMT
మాటలకీ చేతలకీ పొంతనేది స్యామ్‌??
X
నిన్ననే ఫ్రెష్‌ గా ఒక వార్నింగ్‌ఇచ్చేసింది చెన్నయ్‌ చిన్నది సమంతా రుత్‌ ప్రభు. అమ్మడికి సరైన రోల్స్‌ ఇవ్వకపోతే సినిమాలకు బయ్‌ బయ్‌ చెప్పేస్తుందట. ఈ విషయం ఆల్రెడీ చెప్పకున్నాం. కాని 2014 తరువాత ఈ డెసిషన్‌ తీసుకున్నా అని చెబుతుంటే మాత్రం.. అమ్మడి ఓవరాక్షన్‌ కాస్త అధికం అయ్యిందనే అనిపిస్తోంది.

2014లో మనం వంటి క్లాసిక్‌ సినిమాలో నటించింది సమంత. కట్‌ చేస్తే.. రభస, రామయ్య వస్తావయ్యా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా కథ విన్నాకే సంతకం చేసింది. అయితే ముందుగా నిర్మాతలతో సైన్‌ చేసిన డీల్‌ కారణంగా ఈ సినిమాల్లో నటించాల్సి వచ్చిందంటలే. అయినా కూడా వారందరూ పేమెంటు ఫుల్‌ గానే ఇచ్చారుగా సమంతాజీ? ఇకపోతే అంజాన్‌ సినిమాలో బికినీ వేసుకోమని మేం చెప్పామా? నవ్వేగా టూ పీస్‌ కనిపించాలనేది నా జీవిత ధ్యేయం అన్న రీతిలో కనిపించావ్‌. అవన్నీ నువ్వు కావాలంటే ఎవాయిడ్‌ చేసుండొచ్చు. పైగా ఆ సినిమాలకు భారీ పేమెంటు తీసుకునే నటించింది.. అలాంటప్పడు ఆ ఫెయిల్యూర్‌ కారణంగా ఇప్పుడు నేను కావాలంటి సినిమాలు మానేస్తే అంటూ వార్నింగులు ఇవ్వడమేంటి పొంతన లేకుండా...

అసలు ఏ మాయ చేశావే సినిమా తరువాత ఏనాడైనా ఆర్టు సినిమాలూ, రొమాంటికి ఫిలింస్‌ ఏమైనా చేశావే.. అన్నీ పెద్ద హీరోల దగ్గరే. డబ్బు సంపాదన అనే ధ్యాయంతో అన్ని హీరోలతో నటించేసి ఇప్పుడేమో క్విట్‌ ఇండియా, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటే ఎలా బేబీ? నీ మాటలకీ చేతలకీ పొంతన ఉండాలిగా...