Begin typing your search above and press return to search.

మిడిల్ క్లాస్ లోకి జారిన సమంత

By:  Tupaki Desk   |   28 Nov 2015 4:32 AM GMT
మిడిల్ క్లాస్ లోకి జారిన సమంత
X
సౌత్ బ్యూటీ సమంత ఉంటే చాలు.. సినిమా హిట్ అనే టాలీవుడ్ లో సెంటిమెంట్ ఉంది. ఎప్పుడో ఒకటీ అరా మినహా ఇది బ్రేక్ అవలేదు. తమిళ్ లో మాత్రం అంతగా బ్లాక్ బస్టర్స్ సాధించలేకపోయినా క్రేజ్ మాత్రం ఎక్కువగానే ఉంది శామ్స్ కి. ఇంతగా ఈ భామకి డిమాండ్ ఉండడానికి కారణం.. అమ్మడి లుక్స్ అని చెప్పాల్సిందే.

ఏ గెటప్ వేసినా అందులో సెట్ అయిపోవడం సమంత స్పెషాలిటీ. ప్రస్తుతం ఈ వయ్యారి అనేక ప్రాజక్టుల్లో వరుసగా చేసేస్తోంది. అందులో త్రివిక్రమ్ తీస్తున్న అ.. ఆ.. - సూర్యతో కలిసి చేస్తున్న 24 - ధనుష్ తో నటిస్తున్న తంగమగన్ ఉన్నాయి. ఈ మూడు సినిమాలు వేటికవే అయినా, పాత్రల మధ్య ఒక పోలిక ఉంది. అన్నింటిలోనూ సమంత సింపుల్ అండ్ కూల్ లుక్ తో అదరగొట్టేస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో అప్పర్ మిడిల్ క్లాస్ గాళ్ గా శామ్స్ కనిపించనుంది. ఈ విషయం రీసెంట్ గా లీక్ అయిన ఓ ఫోటోతో వెల్లడైంది.

ఇక కాలంతో ప్రయాణం కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సూర్య మూవీ 24 చిత్రంలోనూ.. ఈమె పాత్ర చాలా సింపుల్. మిడిల్ క్లాస్ అమ్మాయిగానే తళుక్కుమంటోంది. ఇక చివరగా ధనుష్ సరసన తంగమగన్ లోనూ ఇదే తీరు. గతంలో తెలుగులో వచ్చిన రఘువరన్ బీటెక్ తీసిన డైరెక్టరే ఇది కూడా తీస్తున్నాడు. మొదటి దానికి సీక్వెల్ అనుకున్నారు కానీ.. కాదని తర్వాత తేలిపోయింది. కాకపోతే.. స్టోరీ బేస్ అలాగే ఉంటుందని చెప్పారు. మూడు సినిమాల్లోనూ మిడిల్ క్లాస్ గాళ్ కనిపిస్తున్న సమంత.. లుక్స్ లో మాత్రం ఇంతటి వేరియేషన్ చూపించడం విశేషమే.