Begin typing your search above and press return to search.

సమంత చెబుతున్న మహా భారతం

By:  Tupaki Desk   |   3 Nov 2015 9:00 PM IST
సమంత చెబుతున్న మహా భారతం
X
వెండితెరపై సందడి చేసే హీరోయిన్ లలో మరికొన్ని కోణాలు కూడా ఉంటాయి. వీలైనంత వరకూ వీటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కానీ సమంత అలా కాదు. తనకు అనిపించిన విషయాలను టక్కుమంటూ ట్వీట్ చేసి చెప్పేస్తుంది. ఎక్కడ చదివిందో ఎప్పుడు చదివిందో తెలీదు కానీ.. ట్విట్టర్ లో భారతంలోని నీతి సూత్రాలను వల్లిస్తోంది. అది కూడా అందులో ఉన్నవి ఉన్నట్లుగా కాదు. మొత్తం చదివేసి సారాన్ని మాత్రం బోధిస్తోంది సమంత.

"అన్ని విధాలైన సంపదను కలిగి ఉండేవాళ్లెవరో తెలుసా ? ఎవరైతే బాధ-సంతోషం - అదృష్టం-దురదృష్టం - గతం-భవిష్యత్తులను సరిసమానంగా చూడగలరో.. వారే సంపన్నులు. ది మహాభారత్ " అంటూ ట్వీట్ చేసింది సమంత. ఒక్కసారిగా సమంతకు మహాభారతం ఎందుకు గుర్తొచ్చిందో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు ఫ్యాన్స్. అయితే.. రీసెంట్ గా ఎన్నో ఆశలు పెట్టుకున్న కోలీవుడ్ మూవీ 10 ఎన్రాదుకుళ్ల ఫ్లాప్ తర్వాత.. ఈ మాత్రం వేదాంతం నేర్చుకోకపోతే ఎలా అనుకుంటున్నారు చాలా మంది.

ప్రస్తుతం ఈ భామ కెరీర్ కూడా సాఫీగా ఉన్నట్లే కనిపించినా.. అంత బూమ్ లో లేదనే చెప్పాలి. కనిపిస్తే హిట్టు అనే సెంటిమెంట్ కూడా ఇప్పుడు వర్కవుట్ అవ్వడం లేదు. అయినా మాంచి హిట్ కొట్టినపుడు ఏం చేసినా, చెల్లిపోతుంది శామ్స్... ఇలా ఫ్లాప్ తర్వాత నీతులు చెబితే.. నీమీదే జోకులు పేలతాయి. గుర్తుంచుకో.