Begin typing your search above and press return to search.
సమంత.. ఓ ఛాలెంజ్.. అంతే!!
By: Tupaki Desk | 10 March 2018 4:28 AM GMTఅందంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నటనలో జాగ్రత్తగా లేకపోతే హీరోయిన్స్ ఇమేజ్ తగ్గిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. ఎంత గ్లామర్ రోల్స్ లో కనిపించినప్పటికీ ఒకానొక దశలో పల్లెటూరి అమ్మాయిలా లేక డి గ్లామర్ పాత్రల్లో నటిస్తే అప్పుడు వచ్చే క్రేజ్ వేరే ఉంటుంది. ఏ హీరోయిన్ కి అయినా ఆ ఇమేజ్ చాలా అవసరం. ఆ తరహాలో కొంత మందే నిరూపించుకోగలుగుతున్నారు.
మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోన్న రంగస్థలం సినిమాలో సమంత క్యారెక్టర్ కూడా దాదాపు ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తోంది, ఎందుకంటే సినిమాకు సంబందించిన ఫొటోస్ లలో అక్కినేని కోడలు ఎప్పుడు కనిపించని మాస్ లుక్ లో కనిపిస్తోంది. అంతే కాకుండా రీసెంట్ గా రిలీజ్ అయినా రంగమ్మ మంగమ్మ పాటకు సంబందించిన ఫొటోస్ లలో కూడా సమంత ఊర మాస్ లెవెల్లో హావభావాలను అందించింది. రామలక్ష్మి పాత్రలో సమంత ప్రేక్షకులను థ్రిల్ 100% చేయగలడు అని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ - రాశి ఖన్నా అలాగే పూజా హెగ్డే - రెజీనా వంటి స్టార్ హీరోయిన్స్ ఇలాంటి పాత్రల్లో మెప్పిస్తారా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెజీనా గ్లామర్ లవ్ స్టారోలకే పరిమితమయ్యింది. రకుల్ కూడా దాదాపు అదే స్థాయిలో నటిస్తోంది. ఇక రాశి ఖన్నా కొంచెం కొత్తగా ట్రై చేస్తోంది గాని ఇంకా చాలా నేర్వాలి. పూజా హెగ్డే అయితే ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది గాని సమంత లెవెల్లో దానికి మాస్ యాంగిల్ ని టచ్ చేయలేదు. మొత్తానికి సమంతకు నటిగా గుర్తుండిపోయె సినిమాగా రంగస్థలం నిలుస్తుందని చెప్పవచ్చు.