Begin typing your search above and press return to search.

పుట్టెడంత దుఖంలో స‌మంత

By:  Tupaki Desk   |   27 Oct 2015 3:38 PM GMT
పుట్టెడంత దుఖంలో స‌మంత
X
అందాల స‌మంత‌కి మాన‌సిక శాంతి కొర‌వ‌డింది. అనూహ్య రీతిలో అన‌తికాలంలోనే స్టార్ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకొన్న ఆమెకి సినిమాల ప‌రంగా తిరుగన్న‌దే లేదు. కానీ వ్య‌క్తిగ‌తంగా మాత్రం దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. జ‌బ‌ర్‌ ద‌స్త్ సినిమా స‌మ‌యంలో చ‌ర్మ వ్యాధితో కొంత‌కాలంపాటు ఇంటికే ప‌రిమిత‌మైంది. ఆ కొన్ని నెల‌లు నా జీవితానికి చీక‌టి రోజులు అని చెబుతుంటుంది స‌మంత‌. ఎట్ట‌కేల‌కు ఆ వ్యాధి నుంచి కోలుకొని మ‌ళ్లీ సినిమా ప్ర‌యాణం మొద‌లుపెట్టింది. విజ‌యాలు అందుకొంది. అంతా స‌వ్యంగా సాగిపోతోంద‌నుకొంటున్న ద‌శ‌లో మ‌ళ్లీ ఆమెని వ్య‌క్తిగ‌త క‌ష్టాలు చుట్టుముట్టాయి. ఇటీవ‌లే స‌మంత ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆ ప‌రిణామం స‌మంత‌ని బాగా ఇబ్బంది పెట్టింది. అలాగ‌ని బాధ‌ప‌డుతూ కూర్చుంటే చేతిలో వున్న సినిమాలకు ఇబ్బందని మ‌ళ్లీ ఆమె బిజీ అయిపోయారు. ఓ వైపు తెలుగు, మ‌రోవైపు త‌మిళ్ ప్రాజెక్టుల‌తో ఊపిరిస‌ల‌ప‌నంత బిజీగా కొన‌సాగుతోంది. ఇంత‌లో ఆమెకి మ‌రో బ్యాడ్ న్యూస్. స‌మంత మేన‌మామ యాండీ మోరిస్ (58) అనుమానాస్పదంగా మృతి చెందాడు. యాండీ చెన్న‌య్‌ కి స‌మీపంలోని ప‌ల్ల‌వరం అనే చోట త‌న ఆఫీసులోనే విగ‌త జీవుడై క‌నిపించ‌డం స‌మంత‌కి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఆ వార్త విన్న వెంట‌నే హుటాహుటిన స‌మంత ఇంటికి చేరుకొంది. ఇప్పుడు స‌మంత మామ మ‌ర‌ణం పోలీసుల‌కి స‌వాల్‌ గా మారింది. ఇది మ‌ర్డ‌రా లేక సూసైడా? అన్న‌ది తేల్చే ప‌నిలో ఉన్నారు. మ‌రి స‌మంత ఈ బాధ నుంచి ఎప్పుడు కోలుకొంటుందో పాపం.