Begin typing your search above and press return to search.

మెగా బ్రదర్‌ తో సినిమాకు సమంత సైన్‌

By:  Tupaki Desk   |   30 Jan 2022 2:30 PM GMT
మెగా బ్రదర్‌ తో సినిమాకు సమంత సైన్‌
X
తమిళ మెగా బ్రదర్స్ సూర్య మరియు కార్తీలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అటు తమిళం లో ఇటు తెలుగు లో కూడా మంచి సక్సెస్ లు దక్కించుకుంటున్నారు. తెలుగు లో మంచి బిజినెస్ ఉన్న ఈ హీరోల సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోయిన్స్ ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అందుకే సూర్య ఇప్పటికే రెండు సార్లు తెలుగు స్టార్ హీరోయిన్ అయిన సమంతతో కలిసి నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆయన తమ్ముడు మెగా బ్రదర్ కార్తీ కూడా సమంతతో సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. సమంత మరియు కార్తీల కాంబోలో సినిమా ఎప్పుడో రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల అప్పుడు క్యాన్సిల్‌ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబో సెట్‌ అయ్యిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బ్యాచిలర్‌ సినిమా తో మంచి మార్కులు దక్కించుకున్న దర్శకుడు సతీష్‌ సెల్వకుమార్‌ దర్శకత్వంలో కార్తీ మరియు సమంతల కాంబో సినిమా పట్టాలెక్కబోతుంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో చాలా స్పీడ్ అయ్యింది. ఇప్పటికే ఆమె నటించిన తెలుగు సినిమా శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. తమిళ సినిమా ఒకటి కూడా విడుదల కోసం వెయిటింగ్‌ లో ఉంది. ఇదే సమయంలో యశోద అనే ఒక భారీ మల్టీ లాంగ్వేజ్ మూవీ కూడా షూటింగ్‌ దశలో ఉంది. ఇక హిందీలో తాప్సి నిర్మాణంలో ఒక సినిమాను చేసేందుకు ఈమె ఓకే చెప్పింది. ఒక వెబ్‌ సిరీస్ ను కూడా ఈమె చేయబోతుంది. ఇవి కాకుండా ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా కనిపించబోతుంది. ఇన్ని సినిమాల్లో నటిస్తూ ఉన్న సమంత తాజాగా కార్తీ కి జోడీగా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది.

పుష్ప సినిమా లో ఐటెం సాంగ్‌ చేయడంతో సమంత క్రేజ్ మరింతగా పెరిగింది. హీరోయిన్‌ గానే కాకుండా ఐటెం సాంగ్స్ కు కూడా సమంత ను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె నుండి ముందు ముందు మరిన్ని ఐటెం సాంగ్స్ మరియు ఆకట్టుకునే మంచి పాత్రలు వస్తాయనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఈ సమయంలో కార్తీతో సినిమా ను చేసేందుకు కమిట్ అవ్వడంతో తమిళ మరియు తెలుగు ప్రేక్షకులు ఖుషీ ఫీల్‌ అవుతున్నారు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని.. తమిళంలోనే కాకుండా తెలుగు లో కూడా ఈ సినిమా సమంత వల్ల మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. గతంలో సూర్య తో కలిసి నటించి మెప్పించిన సమంత ఇప్పుడు తమ్ముడు కార్తీ తో కలిసి నటించబోతున్న సినిమా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.