Begin typing your search above and press return to search.

సమ్మర్‌ ను సమంతకు రాసిచ్చేశారంతే

By:  Tupaki Desk   |   11 March 2016 4:00 AM IST
సమ్మర్‌ ను సమంతకు రాసిచ్చేశారంతే
X
ఒకానొక టైములో గోల్డెన్‌ లెగ్‌ అంటూ అందరూ సమంతను తెగ పొగిడేశారు. ఆ తరువాత వరుసగా ఓ నాలుగైదు భారీ ఫ్లాపులు రావడంతో.. బికినీ వేసినా కూడా పిల్ల సినిమాలు ఎవ్వరూ చడట్లేదు అంటూ అందరూ పెదవి విరిచారు. అందుకే కాస్త గ్యాప్‌ తీసుకొని.. నిధానంగా ఆలోచించుకుని.. అప్పుడు మళ్లీ సినిమాలు సైన్‌ చేయడం మొదలెట్టిందీ చెన్నయ్‌ సైరన్‌.

అలా చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఒకేసారి రిలీజ్‌ కు వచ్చేస్తున్నాయి. ఏప్రియల్‌ 14న తమిళ సినిమా 'తెరీ' వస్తోంది. పైగా ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ తో దర్శకుడు అట్లీ అండ్‌ హీరో విజయ్‌ ఇరగదీసేయడంతో.. సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్లు ఉన్నాయి. అలాగే తొలి టీజర్‌ తో అబ్బురపరిచిన మరో తమిళ/తెలుగు సినిమా '24'. సూర్య హీరోగా విక్రమ్‌ కుమార్‌ తీసిన ఈ సినిమా ఏప్రియల్ 29న వస్తోంది. ఇక తెలుగు సినిమాల లిస్టు చూసుకుంటే.. మే 6న ''అ..ఆ'' సినిమా వస్తోంది. త్రివిక్రమ్‌ సినిమాగా ఈ మూవీపై చాలా అంచనాలున్నాయి. ఇక మే 20న మహేష్‌ బాబు ''బ్రహ్మోత్సవం'' ఎలాగో ఉంది. వీటన్నింటిలో సమంత మెయిన్‌ హీరోయిన్‌. పైగా ప్రతీ సినిమాలోనూ తన క్యారెక్టర్‌ కొత్తగా ఉందంతే.

వరుసగా ఇలా నాలుగు సినిమాలతో రెండు ఏరియాల్లో.. సమ్మర్‌ మొత్తాన్నీ సమంత హైజాక్‌ చేసేసిందంతే. అందరూ కలసి సమ్మర్‌ ను ఆమెకు రాసిచ్చేశారు. వీటిలో ఎన్ని సినిమాలు ఆమెకు హిట్టు రిజల్టును ఇచ్చి రచ్చ చేస్తాయో చూడాలి!!