Begin typing your search above and press return to search.
సమంత 'సాకీ వరల్డ్' వ్యాపారం
By: Tupaki Desk | 5 Sep 2020 11:30 PM GMTసమంత నిన్న ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్లుగా సోషల్ మీడియా ప్రకటించింది. ఆమె కొత్త సినిమా గురించి ప్రకటించే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆమె తన కొత్త వ్యాపారం తాలూకు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే సమంత చాలా రంగాల్లో ఉంది. ఒక వైపు హీరోయిన్ గా రాణిస్తూ మరో వైపు స్వచ్చంద సంస్థను నిర్వహిస్తూ.. స్కూల్.. మోడలింగ్ రంగంలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ మొత్తానికి సమంత బిజీ బిజీగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంది. ఈ సమయంలోనే ఆమె ఒక కొత్త వ్యాపారంను ప్రారంభించబోతున్నాను అని.. ఇది నా డ్రీమ్ అన్నట్లుగా నేడు అషిషియల్ గా అనౌన్స్ చేసింది.
ఈమద్య కాలంలో స్టార్స్ పలువురు క్లాత్ బిజినెస్ లో ఆసక్తి చూపిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా సమంత కూడా 'సాకీ వరల్డ్' అనే పేరుతో బట్టల వ్యాపారానికి సిద్దం అయ్యింది. త్వరలో ఒక ఔట్ లెట్ ను ప్రారంభించబోతుందట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొంది. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అందరికి అందుబాటులో ఉండే ధరలతో సాకీ వరల్డ్ ఉంటుందని సమంత పేర్కొంది. త్వరలో మొదటి ఔట్ లెట్ ను ప్రారంభించి ఆ తర్వాత చైన్ సిస్టంతో హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరు.. వైజాగ్ ఇలా ముఖ్య పట్టణాలకు ఆమె సాకీ వరల్డ్ ను విస్తరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈమద్య కాస్త సినిమాల సంఖ్య తగ్గించిన సమంత ఇలా సైడ్ బిజినెస్ లపై దృష్టి పెట్టింది. సినిమాల్లో కూడా ఈమె నటించనుంది. అయితే ఈ సమయంలో ఆమె సాకీపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఈ ఏడాది చివరి వరకు షూటింగ్స్ కు ఈమె వెళ్లదని అంటున్నారు. అప్పటి వరకు సాకీ వరల్డ్ ను విస్తరించాలని కూడా భావిస్తోందట. సమంత కొత్త యాపారంకు ఆమె అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఆల్ ది బెస్ట్ అంటూ బెస్ట్ విషెష్ చెబుతున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి