Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పర్ఫెక్ట్ సమంత

By:  Tupaki Desk   |   15 Jan 2018 8:00 AM GMT
ఫోటో స్టోరీ: పర్ఫెక్ట్ సమంత
X
టాలీవుడ్ బ్యూటీ సమంత ఇప్పుడు మళ్లీ సినిమాలతో సత్తా చాటేందుకు ప్రిపేర్ అయిపోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత షూటింగ్స్ కు చిన్న బ్రేక్ ఇచ్చిన సామ్.. మళ్లీ కొన్ని వారాలకే ప్రొఫెషనల్ వర్క్స్ లో పడిపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ గతంలో కమిట్ అయిన సినిమా షూటింగ్స్ ను పూర్తి చేసేస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీగా ఉండడం సమంతకు మహా సరదా. పెళ్లికి ముందు నుంచే ఇలా హంగామా చేస్తున్న సామ్.. ఇప్పుడు ఆ డోస్ మరింత పెంచింది కూడా. రీసెంట్ గా చర్చ్ కు ప్రేయర్ కు వెళుతూ ఓ పోస్ట్ చేసిన సామ్.. గత వీకెండ్ ను ఎలా ఎంజాయ్ చేసిందో కూడా చూపించింది. హాఫ్ వైట్ డ్రెస్ లు డిఫరెంట్ గెటప్ తో అలరిస్తున్న ఈ బ్యూటీ.. హార్ట్ షేప్ లో ఇయర్ రింగ్స్.. పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయేలా గాగుల్స్ తో తెగ సంగడి చేసింది. ఇక గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గకపోవడం సమంత స్పెషాలిటీగా చెప్పాలి. పెళ్లి తర్వాత ఈ స్థాయిలో గ్లామర్ సమంత దర్శనం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం.

రామ్ చరణ్ తో కలిసి తొలిసారిగా నటిస్తున్న మూవీ రంగస్థలం మూవీ అప్ డేట్స్ ను కూడా రీట్వీట్ చేసింది సమంత. ఈ మూవీలో పక్కా పల్లెటూరి నాటు అందంగా సామ్ కనిపిస్తున్న ఫోటోలు.. మూవీపై ఆసక్తిని మరీ పెంచేస్తున్నాయి. మరోవైపు తమిళ్ లో విశాల్ తో కలిసి నటించిన మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది సమంత.