Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో సామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా...?

By:  Tupaki Desk   |   16 May 2020 3:30 PM GMT
టాలీవుడ్ లో సామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా...?
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత అక్కినేని ఒకరు. దశాబ్దకాలంగా తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తూ సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 'ఏ మాయ చేసావే' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సమంత.. విభిన్న పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తెలుగులో మహేష్ బాబు, పవన్‌ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్‌ చరణ్, నాగ చైతన్య, అల్లు అర్జున్, నాని, నితిన్ లాంటి హీరోలతో కలిసి నటించిన సమంత స్టార్‌ హోదాను దక్కించుకున్నారు. కేవలం గ్లామర్‌ పాత్రలే కాకుండా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో కూడా అదరగొడుతున్నారు. అలాగే నటనకు ప్రాధాన్యం ఉన్న చిన్న రోల్స్‌లో కూడా మెప్పించడం ఆమెకే చెల్లింది. తన మొదటి హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. తెలుగింటి కోడలిగా మారారు. పైళ్లైనా తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం చూసి ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. గతేడాది 'సూపర్ డీలక్స్' 'ఓ బేబీ' 'మజిలీ' సినిమాల్లో నటించిన సమంత ఈ ఏడాది 'జాను' సినిమాతో పలకరించింది.

సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌ లో సమంత కీలక పాత్రలో నటిస్తోంది. దీనిలో సామ్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. అంతేకాకుండా ఒక తమిళ్ సినిమాలో కూడా నటిస్తోంది. అయితే మన తెలుగులో మాత్రం సమంత కొత్త ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయనప్పటికీ ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సమంత లాక్ డౌన్ లో స్క్రిప్ట్స్ వింటోందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆమె నటించబోతుందని సమాచారం. మైత్రీ వారితో కలిసి ఇప్పటికే 'జనతా గ్యారేజ్' 'రంగస్థలం' సినిమాల్లో నటించిన సమంత వారితో మరో సినిమా చేయడానికి అప్పట్లోనే ఒప్పందం కుదుర్చుకుందట. ఇప్పటికే మైత్రీ వారు నారేట్ చేసిన స్క్రిప్ట్స్ లో ఒకటి ఓకే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే సమంత సోనీ పిక్చర్స్ వారితో ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.