Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ రూల్‌నే అతిక్రమించిందే

By:  Tupaki Desk   |   17 July 2015 5:13 AM GMT
మెగాస్టార్‌ రూల్‌నే అతిక్రమించిందే
X
బాలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఎందెందైనా మెగాస్టార్లంతా ఒక రూల్‌ని పాటిస్తుంటారు. సెట్‌కి వెళ్లే ముందే డైలాగులపై గ్రిప్‌ పట్టేసి, ప్రాక్టీస్‌ చేసి మరీ వెళుతుంటారు. అమితాబ్‌, చిరంజీవి, మమ్ముట్టి, రజనీకాంత్‌ అంతటి వారే ప్రీప్రాక్టీస్‌ లేనిదే ఆన్‌సెట్స్‌ వెళ్లరు. అలాంటిది ఈ ఐదేళ్లలో స్టార్‌ అనిపించుకున్న సమంత ఈ రూల్‌తో తనకి పనేమీ లేదని సెలవిచ్చింది.

నేనేమీ ముందుగా ప్రాక్టీస్‌ చేయను. పరీక్షలకు వెళ్లే ముందు ప్రిపేరవ్వాలి కానీ, మరీ ఎక్కువ బట్టీ కొట్టేస్తే తీరా పరీక్షల్లో రాయలేని పరిస్థితి వచ్చేస్తుంది. చదివింది అంతా మర్చిపోతాం. అలాగే సెట్‌కి వెళ్లే ముందు మరీ ఎక్కువ ప్రిపరేషన్‌తో వెళితే ఉన్నది కాస్త మర్చిపోతాం. అందుకే నేను ప్రీప్రాక్టీస్‌ని లైట్‌ తీసుకుంటా. సెట్‌లో డైరెక్టర్‌ చెప్పింది విని చేసేస్తా.. అని డాంబికాలు పలికింది. అంతేనా ప్రతి నటిలోనూ సహజనటి ఉంటుంది. అది ఆన్‌సెట్స్‌ బైటికొస్తుందని సెలవిచ్చింది.

అయితే సమంత చెప్పిన ఈ నెగెటివ్‌ పాయింట్‌ని అప్‌కమింగ్‌ నాయికలు దృష్టిలో పెట్టుకుంటే కెరీర్‌లో ఖతమ్‌. ఈ అమ్మడికి ఇప్పటికే చాలా అనుభవం ఉంది కాబట్టి ఇవన్నీ చెబుతోంది. అందరూ అలా చేస్తామంటే అంతే సంగతి. తస్మాత్‌ జాగ్రత్త.