Begin typing your search above and press return to search.

సమంత ఓపెన్ అయ్యేది ఎప్పుడో

By:  Tupaki Desk   |   18 May 2016 9:47 AM IST
సమంత ఓపెన్ అయ్యేది ఎప్పుడో
X
సహజంగా హీరోయిన్లు రిజర్వడ్ గా ఉండేందుకు ట్రై చేస్తారు. పది ప్రశ్నలు అడిగినా తాము చెప్పదలచుకున్నది తప్ప.. వేరే ఏ రకమైన మాటలు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ముఖ్యంగా ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే.. సినిమా గురించి తప్ప మరేమీ అడగద్దని ముందే కండిషన్స్ పెట్టే బాపతు కూడా ఉంటారు. కానీ సౌత్ బ్యూటీ సమంత రూటే వేరు. అడగాలే కానీ.. మొహమాటం లేకుండా చెప్పేస్తుంది ఆన్సర్స్.

ప్రస్తుతం బ్రహ్మోత్సవం ప్రమోషన్స్ లో తెగ బిజీగా ఉన్న సమంత.. మహేష్ చాలా జోవియల్ అని, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి అంటూ తెగ పొగిడేసింది. అదే సమయంలో అంత జోవియల్ గా - సరదాగా - నాటీగా మీరు ఏ హీరోతో ఉండాలని కోరుకుంటారని అడిగితే మాత్రం.. ఎంచక్కా తన తొలి హీరో అయిన నాగచైతన్య పేరు చెప్పేసింది సమంత. పలు ఇంటర్వ్యూలలో ఇలా చైతు పేరు మెన్షన్ చేసింది సమంత. చైతుతో శామ్స్ సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. మనం తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటించలేదు. అయినా సరే.. నాగచైతన్యతో నటించడం అంటే తనకు కంఫర్టబుల్ అని ఓపెన్ గానే చెప్పేస్తుంది సమంత.

ఇప్పుడు చైతు జపం మరికాస్త ఎక్కువైంది. ఇదంతా చూస్తుంటే.. తాము వింటున్నవంతా రైటే అనుకుంటున్నారు సినీ జనాలు. మరి నిజమో కాదో చెప్పాలంటే.. సమంతే నోరు విప్పాలి. తాను సింగిల్ కాదు అనే విషయాన్ని ఫ్రాంక్ గా చెప్పేసిన శామ్స్.. ఆ జంట ఎవరో కూడా చెప్పచ్చు కదా. చీటికీ మాటికీ చైతు భజన చేసే బదులు.. ఏదన్నా మ్యాటర్ ఉంటే ఓపెన్ కావచ్చు కదా అనుకుంటున్నారు చాలామంది.