Begin typing your search above and press return to search.

సామ్ కెరీర్ పాథ్ బ్రేకింగ్ హిట్టు!

By:  Tupaki Desk   |   22 July 2019 2:53 PM GMT
సామ్ కెరీర్ పాథ్ బ్రేకింగ్ హిట్టు!
X
ప్ర‌యోగం చేస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డాలి. తేడా కొట్టిందంటే అది ఎంద‌రినో ముంచేస్తుంది. కానీ ఈ ప్ర‌యోగం ప‌క్కాగా స‌క్సెసైంది. క‌న్విన్సింగ్ గా తీసి హిట్ కొట్టారు. అంతేనా లేడీ ఓరియెంటెడ్ కి టాలీవుడ్ లో అంత ఆద‌ర‌ణ ద‌క్కుతుందా? అని పెద‌వి విరిచేసే మేల్ డామినేటెడ్ ప‌రిశ్ర‌మ‌కు కొత్త పాఠం నేర్పింది. టాలీవుడ్ లో కొత్త ఫేజ్ కి ఆరంభం ఇదే అనేంత గొప్ప విజ‌యం సాధించింది. ఇంత‌కీ అది ఏ సినిమా అంటే ప్ర‌త్యేకంగా చెప్పాలా? అక్కినేని కోడ‌లు స‌మంత న‌టించిన ఓ బేబి గురించే ఇదంతా.

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో కొరియ‌న్ చిత్రం `మిస్ గ్రానీ`ని తెలుగులో ఓ బేబి పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌లు బ్యానర్ల అల‌యెన్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈనెల 5న రిలీజైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి యునానిమ‌స్ గా ప్ర‌శంస‌లు ద‌క్కాయి. స‌మంత న‌ట‌న‌కు సెంట్ ప‌ర్సంట్ మార్కులేశారు విమ‌ర్శ‌కులు. 75 వ‌య‌సు భామ్మ గారు పాతిక ప్రాయం యువ‌తిగా మారితే ఏం జ‌రిగింది? అనే ఆస‌క్తిక‌ర పాయింట్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించ‌డంలో నందిని రెడ్డి స‌క్సెస‌య్యార‌న్న ప్ర‌శంస‌లొచ్చాయి. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌లోనూ దూసుకుపోతోంది.

ఇది ఇప్ప‌టివ‌ర‌కూ బాక్సాఫీస్ లెక్క‌ల ప‌రంగా అక్కినేని కోడ‌లు స‌మంత కెరీర్ బెస్ట్ సినిమాగా రికార్డుల కెక్కింది. ఇప్ప‌టికి ఏకంగా 38 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి ఇంకా స్థిరంగా వ‌సూళ్లు సాధిస్తోంద‌ని ట్రేడ్ చెబుతోంది. రీసెంట్ వీకెండ్ ఓ బేబి 2కోట్ల వ‌సూళ్లు సాధించింద‌ట‌. ఇక అమెరికాలోనూ మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో అడుగు పెట్ట‌నుంద‌ని రిపోర్ట్ అందింది. ఒక మిలియ‌న్ డాల‌ర్ అంటే దాదాపు ఆరున్న‌ర కోట్లు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓవ‌ర్సీస్ నుంచి అంత ద‌క్క‌డం అన్న‌ది ఓ రికార్డు కిందే నిలుస్తుంది. ఓవ‌ర్సీస్ లెక్క‌ల ప‌రంగానూ సామ్ కెరీర్ బెస్ట్ ఓ బేబీనే అవుతుంది. అమెరికాలో జ‌నం ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఓబేబి సాధించిన వ‌సూళ్ల వివ‌రం ప‌రిశీలిస్తే.. ఏపీ - తెలంగాణ క‌లుపుకుని 27 కోట్లు వ‌సూలు చేయ‌గా.. ఓవ‌రాల్ గా 38 కోట్ల గ్రాస్ వ‌సూలైంది. అమెరికా నుంచి 6.7 కోట్ల గ్రాస్ లెక్క తేలింది. అమెరికాయేత‌ర దేశాల నుంచి మ‌రో 86 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. బెంగ‌ళూరు - 2.7 కోట్లు.. చెన్న‌య్ -70ల‌క్ష‌లు.. ఒరిస్సా.. ఉత్త‌ర భార‌తదేశం నుంచి 40ల‌క్ష‌లు వ‌సూలు చేసింది.