Begin typing your search above and press return to search.
కాస్టింగ్ కౌచ్ పై సమంత కూడా.. !
By: Tupaki Desk | 6 May 2018 4:28 PM GMTకాస్టింగ్ కౌచ్.. కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న అంశం. హాలీవుడ్లో మొదలై.. టాలీవుడ్ వరకు ఇదే హాట్ టాపిక్ గా మారింది. శ్రీరెడ్డి ఇష్యూతో ఈ అంశానికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ముందు స్తబ్దుగా ఉన్న సినీ పరిశ్రమ కొన్ని అనూహ్య పరిణామాల తర్వాత స్పందించక తప్పలేదు. కొన్ని చర్యలు కూడా చేపట్టాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రెటీలు కాస్టింగ్ కౌచ్ గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. తాజాగా అక్కినేని వారి కోడలు సమంత సైతం ఈ అంశంపై ఓపెన్ అయింది.
కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదంటూ అందరూ చెప్పే మాటనూ సమంత కూడా చెప్పింది. తాను ఒక్కొక్కరి గురించి స్పందించలేనని.. ప్రతి రంగంలోనూ కొందరు చెడ్డ వ్యక్తులు ఉంటారని సమంత అంది. తాను గత ఎనిమిదేళ్లుగా తెలుగు.. తమిళ సినీ పరిశ్రమల్లో పని చేస్తున్నాని.. తన తొలి సినిమానే పెద్ద విజయం సాధించడంతో తనకు ఎప్పుడూ ఎక్కడా ఇబ్బంది తలెత్తలేదని ఆమె స్పష్టంచేసింది. సినీ పరిశ్రమలో ఎన్నో మంచి విషయాలు జరుగుతుంటాయని.. తనకీ ఇండస్ట్రీ అంటే చాలా చాలా ఇష్టమని.. ఇక్కడే తాను ఎందరో మంచి.. గొప్ప వ్యక్తుల్ని కలిశానని సమంత అంది. అందుకే ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా తాను సినీ పరిశ్రమలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు సమంత చెప్పడం విశేషం. ప్రభుత్వం స్పందించి సినీ పరిశ్రమలో అమ్మాయిల కోసం ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడాన్ని ఆమె స్వాగతించింది.