Begin typing your search above and press return to search.

ఈ వేదాంతం ఏందమ్మా సమంత !?

By:  Tupaki Desk   |   21 Nov 2016 9:49 AM IST
ఈ వేదాంతం ఏందమ్మా సమంత !?
X
''కొన్నికొన్నిసార్లు మనం బ్రతికే ఉన్నాం అనే ఒకే ఒక్క కారణంతో మనం చాలా ఆనందంగా ఉండాల్సి వస్తుంది'' అంటూ వేదాంత దోరణిలో ఒక మాట అనేసింది సమంత. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఎవ్వరూ ఇలాంటి వేదంత తూటాలు పేల్చరు కాని.. సమంత మాత్రం తన తుపాకీ నిండా ఇలాంటి గుళ్లను చాలానే నింపుకుని వస్తుందిలే. ఎప్పటికప్పుడు వాటిని పేలుస్తూనే ఉంటుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ టైములో సమంతకు ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు వచ్చాయి. స్కిన్ ఎలర్జీ అని కొందరు.. లేదు శ్వాసకోస సంబంధమైన ఇన్ఫెక్షన్ అని కొందరు.. చాలానే చెబుతుంటారు కాని.. వాటిలో ఏది నిజమో తెలియదు. అలాగే అమ్మడు తన ముక్కు.. పెదాలు.. హై చీక్స్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వలనే ఇబ్బందులు వచ్చాయని అంటారు కాని.. సమంత మాత్రం ఎప్పుడు రీజన్ ఏంటనేది చెప్పలేదు. కాని హెల్త్ పరంగా భారీ ఆపద నుండే తప్పించుకున్నా అంటూ చెబుతుంటుంది అమ్మడు.

ఆ ఇన్సిడెంట్ తరువాత ఇక అమ్మడు తన సంపాదనలో దాదాపు సగాన్ని పిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యూష్‌ ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేస్తోంది. అంతే కాదు.. అప్పటినుండే ఈ వేదాంతం అంతా మాట్లాడుతోంది. సమంత వేదాంతలో ఉన్న డెప్త్ ను అర్ధంచేసుకోవడం కాస్త కష్టమే కాని.. అది అర్ధమైన వారికి మాత్రం సమంత చాలా గొప్ప మనిషిలా కనిపిస్తుందట. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/