Begin typing your search above and press return to search.

అలాంటి పాత్రలు చేయను -సమంత

By:  Tupaki Desk   |   16 Oct 2017 11:30 AM IST
అలాంటి పాత్రలు చేయను -సమంత
X
టాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత పెళ్లి జరిగాక చాలా మారిపోయింది. చాలా వరకు కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రస్తుతం అమ్మడు చాలా హ్యాపీగా ఉంటోంది. ఎక్కడ చూసినా చిరునవ్వుతో దర్శనం ఇస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఈ ప్రపంచంలో తనకన్నా ఎక్కువ సంతోష పడేవాళ్లు ఎవరు లేరని చాలా హ్యాపీగా చెబుతోంది.

అయితే ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సమంత ఇక నుంచి కథల ఎంపిక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె తన కొత్త నిర్ణయాన్ని చెప్పింది. ఇప్పటి నుండి కేవలం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తాను అని చెప్పింది. గతంలో దూకుడు సినిమాలో చేసినటువంటి పాత్రలను ఏ మాత్రం చెయ్యనని చెప్పింది. రీసెంట్ గా రాజు గారి గది 2 సినిమాలో అమృత పాత్ర తనకు బాగా నచ్చిందని ఇక నుంచి కథలో పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే చేస్తానని సమంత వివరించింది.

ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ వారి క్యారెక్టర్స్ కి తగ్గట్టు సినిమాలను చేస్తున్నారని రకుల్ ప్రీత్ సింగ్ రారండోయ్ వేడుక చూద్దాం అలాగే ఫిదా లో సాయి పల్లవి తో పాటు నివేత థామస్ - నిన్నుకోరి సినిమాల్లో వారు చేసిన పాత్రలు చాలా నచ్చాయని ఇకనుండి అలాంటి పాత్రలనే చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపుతాను అని చెప్పింది సమంత.