Begin typing your search above and press return to search.

హిట్ పెయిర్.. సమంత మీనింగ్

By:  Tupaki Desk   |   26 Aug 2017 5:00 AM GMT
హిట్ పెయిర్.. సమంత మీనింగ్
X
ఒక్కసారి ఓ సినిమా హిట్ అయ్యిందంటే చాలు ఆ సినిమాకి సంబందించిన కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని అభిమానులు తేగ ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా దర్శకుడు -హీరో అనే కాంబో మీద ఓ స్థాయిలో ఊహించుకుంటే. హీరో-హీరోయిన్ జోడిపై మరో స్థాయిలో ఊహించుకుంటారు. అభిమాన హీరోతో కరెక్ట్ గా కెమిస్ట్రీ సెట్ అయిన భామలతో రొమాన్స్ చేస్తే ఇక సినిమాకి అదే హైలెట్ అవుతుందని దర్శక నిర్మాతలు కూడా సక్సెస్ కు ఇది ఫార్ములా అన్నట్టుగా భావిస్తారు.

అయితే ఈ విధానంపై టాలీవుడ్ అందాల జెస్సి - అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కోడలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ప్రస్తుత రోజుల్లో హీరో-హీరోయిన్ లైన్ గా ఓ రెండు సినిమాల్లో నటించి హిట్ అందుకుంటే. చాలా వరకు సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు అది ఎంతవరకు నిజమే తెలియదు గాని నటించే వారికీ ఇక అడ్వాంటేజ్ ఉంటుందని సమంత చెబుతోంది. అదేమిటంటే.. ఇంతకుముందే సినిమాల్లో నటించి హిట్ అందుకున్నాము కాబట్టి.. ఎదుటి వ్యక్తి ఏ సమయంలో ఎలా నటిస్తాడో అనే దాని మీద మనకు ఒక క్లారిటీ ఉంటుంది. దీంతో అతనితో నటించడం పెద్దగా కష్టం అనిపించదు.. అంటోంది సమంత.

''నేను.. నాగ చైతన్య - మహేష్ బాబు - ఎన్టీఆర్ లతో ఎక్కువ సినిమాలను చేశా. వారికి నాకు మధ్య నటనలో ఒక అవగాహన ఉంటుంది. ఒకరి మైనస్ లు అలాగే పాజిటివ్ లు ఎంటనేవి అర్ధం చేసుకొని నటిస్తూ ఉంటే సినిమా ఒక మంచి ట్రాక్ లో వస్తుంది.. అందుకే హిట్ పెయిర్ అనేదాన్ని నేను నమ్ముతాను'' అని హిట్ పెయిర్ కు మీనింగ్ చెబుతోంది సమంత. ఇలాగే అభిమానులు కూడా అనుకుంటారేమో అని చెబుతూ.. హిట్ పెయిర్ సినిమాలు రావాలని భావిస్తోంది.