Begin typing your search above and press return to search.

స‌మంత త‌ప్పులేవీ చెయ్య‌ను అంది!

By:  Tupaki Desk   |   16 Feb 2020 12:09 PM GMT
స‌మంత త‌ప్పులేవీ చెయ్య‌ను అంది!
X
మ‌జిలీ- ఓ బేబి లాంటి క్లాసిక్ హిట్స్ అందుకుంది స‌మంత‌. 2019 స‌మంత నామ సంవ‌త్స‌రం అంటూ కీర్తించారు క్రిటిక్స్. అయితే ఇంత‌లోనే తాను ఊహించ‌ని తొలి డిజాస్ట‌ర్ ఖాతాలో ప‌డింది. తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌ల‌చిన చందంగా జాను చిత్రం డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ తో తీవ్రంగానే నిరాశ‌ప‌రిచింది.

ఈ సినిమా దాదాపు 22 కోట్ల మేర బిజినెస్ చేస్తే మూడొంతుల్లో ఒక వంతు మాత్ర‌మే షేర్ ని రాబ‌ట్టింద‌ని ట్రేడ్ చెబుతోంది. అంటే ఏడు కోట్లు మించి వ‌సూల‌వ్వ‌ని ప‌రిస్థితి. ఇప్ప‌టికే థియేట‌ర్లు ఖాళీ అయిపోవ‌డంతో మిగ‌తా రెండొంతులు న‌ష్ట‌పోయిన‌ట్టేన‌న్న టాక్ వినిపిస్తోంది. అస‌లు తాను స్క్రిప్టు ఎంపిక‌లో ఎలాంటి మిస్టేక్ చేయ‌న‌నే న‌మ్మ‌కంతో ఉన్న సామ్ ఎందుక‌ని బోల్తా కొట్టిన‌ట్టు? మ‌జిలీ.. ఓబేబి.. అంత‌కుముందు రంగ‌స్థ‌లం ఇవ‌న్నీ మంచి సెలెక్ష‌న్లే. ఇప్పుడు జాను సెలెక్ష‌న్ కూడా రాంగ్ ఏమీ కాదు.

త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన 96 చిత్రానికి రీమేక్ గా జాను వ‌చ్చింది. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో జాను డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ వైపు వెళుతోంది. 96 చిత్రాన్ని ఆల్రెడీ చూసిన వాళ్లెవ‌రూ తిరిగి జాను ని థియేట‌ర్ల‌లో చూడాల‌న్న ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చలేదు. పైగా తెలుగు ఆడియెన్ థియేట‌ర్ల‌కు వ‌చ్చే సీజ‌న్ ఇది కానే కాద‌న్న‌ది కూడా తెలిసిందే. సంక్రాంతి ఊపు అయిపోయాక వ‌చ్చిన చిత్ర‌మిది. దాంతో పాటే స్లో నేరేష‌న్ జాను డిజాస్ట‌ర్ కి కార‌ణ‌మైంద‌న్న విమ‌ర్శ ఉండ‌నే ఉంది. ఫ్లాప్ కి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు యాడ‌య్యాయ‌నే చెప్పాలి. అయితే ఒక క్లాస్ సినిమాని క్లాసిక్ ట‌చ్ తో తెర‌పై చూపించాల‌న్న దిల్ రాజు ఆలోచ‌న ఈ ఫ్లాప్ కి కార‌ణ‌మ‌ని భావించాల్సి ఉంటుంది. తెలుగు ఆడియెన్ ప‌ల్స్ ప‌ట్టుకోవ‌డంలో ఈ ఒక్క‌సారికి తేడా కొట్టింది. ఏదేమైనా స‌మంత బ్రాండ్ వ్యాల్యూ మాత్రం అమాంతం ప‌డిపోయింది మ‌రి.