Begin typing your search above and press return to search.
ఆ ఒక్క సీన్.. రిస్క్ తీసుకున్న సమంత
By: Tupaki Desk | 1 May 2018 6:18 PM GMTలెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవితంపై రూపొందిన బయోపిక్ మహానటి. ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత.. జర్నలిస్ట్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మధురవాణి పాత్రలో నటించిన సమంత.. మహానటిలో ఓ క్యారెక్టర్ పోషించింది అంతే. ఓ టాప్ హీరోయిన్.. ఇలా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు యాక్సెప్ట్ చేసిందంటే.. దాని వెనుక పెద్ద కారణమే ఉండి ఉంటుందని అంచనా వేయచ్చు. ఇలా చేయడానికి ఒక్క సీన్ కారణం అంటోంది సమంత.
"మహానటి సావిత్రి గారి పై సినిమా.. ఇలాంటి సినిమాలో చేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ చిత్రంలో నా భాగం కూడా కొంత ఉంది. ఈ సినిమాకి నేను రిస్క్ తీసుకున్నాను. నేను ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కాదు అనే సంగతి తెలుసు. కానీ తప్పనిసరిగా జనాలకు చెప్పాల్సిన ఒక కథకు సంబంధించిన ఈ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమాకు నేను డబ్బింగ్ చెప్పాను.. ఇందుకు కారణం మూవీలో ఒక సీన్ ఉంటుంది. నేను ఒక హీరోయిన్ అయి ఉండి.. మరో గ్రేట్ హీరోయిన్ గురించి చెప్పే సీన్ అది. ఆ ఒక్క సన్నివేశం కోసమే ఈ సినిమాకు సైన్ చేశాను" అని చెప్పింది సామ్.
"నేను చాలా సినిమాలు చేశాను.. వాటిలో నేనొక్కదాన్నే హీరోయిన్ ని. కానీ నేనెప్పుడూ మహానటి మూవీలో మాదిరిగా.. ఆ పాత్రలతో అంతగా కనెక్ట్ కాలేకపోయాను. ఆ సీన్ చేసేటపుడు 7-8 టేక్స్ చేసినా.. గ్లిజరిన్ వాడలేదు. సీన్ అయిపోయినా సరే.. నా కళ్ల వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. సావిత్రి గారు ఉన్న ఆ గొప్ప ప్రొఫెషన్ లోనే నేను ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఇంత గొప్ప కథలో నన్ను భాగం చేసినందుకు నాగ్ అశ్విన్ కు కృతజ్ఞతలు. తెలుగు సినిమా వెలుగులు అద్దుతున్న ప్రియాంకకు అభినందనలు.. రాక్ స్టార్ విజయదేవరకొండ.. లవ్ లీ వర్కింగ్ విత్ యుు. దుల్కర్.. అందరూ నీతో ప్రేమలో పడిపోవడం ఖాయం" అంటూ ఆ ఒక్క సీన్ గురించి లీక్ చేయకుండానే స్పీచ్ ముగించింది అక్కినేని కోడలు.