Begin typing your search above and press return to search.

కుర్ర హీరో కాస్త జాగ్రత్త పడాలి!

By:  Tupaki Desk   |   7 July 2019 11:22 AM GMT
కుర్ర హీరో కాస్త జాగ్రత్త పడాలి!
X
లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులు చేస్తున్నప్పుడు హీరో పాత్రలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. అది స్క్రిప్ట్ దశలోనే గుర్తుపట్టి చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. రిలీజ్ అయ్యాక హిట్ అయితే పేరు మొత్తం అమ్మాయికి వెళ్ళిపోతుంది. తేడా కొట్టిందా ఫలితాన్ని ఇద్దరూ షేర్ చేసుకోవాలి. పరిశ్రమలో ఇలాంటి వింతలు సహజమే కాబట్టి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పిన నాగశౌర్య ఓ బేబీని ఎంచుకోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ఛలోతో తనకంటూ మార్కెట్ ని ఏర్పరుచుకున్న ఈ యూత్ హీరో గత ఏడాది సాయి పల్లవితో కణం సెలక్షన్ లో తొందరపడ్డాడని ఆ టైంలోనే కామెంట్స్ వచ్చాయి. సినిమా ప్లాప్ అయ్యింది కాబట్టి అది అంతగా హై లైట్ అవ్వలేదు.
కానీ ఓ బేబీ కేసు అది కాదు. సూపర్ హిట్ అయ్యింది. అందరూ సమంతా గురించే మాట్లాడుతున్నారు. తర్వాత లక్ష్మి గురించి ఆపై రాజేంద్ర ప్రసాద్ అటుపై రావు రమేష్ ఇలా పోతోంది క్యూ.

వీళ్ళ తర్వాత హీరో నాగ శౌర్య ప్రస్తావన వస్తోంది. నిజానికి ఇందులో తను చేసింది కూడా ఏమి లేదు. మొత్తం సమంతా వన్ విమెన్ షో అయిపోయింది. కల్యాణ వైభోగమే హిట్ ఇచ్చిన అభిమానంతో నందిని రెడ్డి కోసం నాగ శౌర్య ఇది చేశాడా లేక సమంతాకు జోడిగా నటించాను అన్న క్రెడిట్ ఉంటుందన్న లెక్కలో ఒప్పుకున్నాడా అతనికే తెలియాలి. ఇకపైనైనా జాగ్రత్త ఉంటూ ప్రాధాన్యత గురించి ఆలోచించకపోతే మార్కెట్ లో టాక్ ఇంకోలా వెళ్ళిపోతుంది. ఇది గుర్తించే ఉంటాడు కాబోలు