Begin typing your search above and press return to search.

అతనితో రొమాన్స్ కష్టమన్న సామ్

By:  Tupaki Desk   |   10 Jun 2019 1:44 PM IST
అతనితో రొమాన్స్ కష్టమన్న సామ్
X
వచ్చే నెల 5న విడుదల కానున్న ఓ బేబీ మీద మెల్లగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ఇప్పటికే టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఫస్ట్ ఆడియో సింగల్ సైతం హిట్ అయ్యింది. ఈరోజు రెండో పాటను విడుదల చేయబోతున్నారు. నాలో మైమరపు అంటూ సాగే ఈ ట్రాక్ ని మిక్కి జే మేయర్ కంపోజ్ చేయగా మంచి మెలోడీగా ఇది రూపొందినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన సామ్ ఓ షాకింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది.

హీరో నాగ శౌర్యతో రొమాన్స్ చేయించడం చాలా కష్టమైందని అందులోని బాధ తనకు దర్శకురాలు నందిని రెడ్డికి మాత్రమే తెలుసనీ చెబుతూ కొత్త సంగతులు చెప్పింది. సెట్స్ లో ఇలాంటి సన్నివేశాల్లో ఇబ్బందిగా కదలడం ఇతను హీరో ఎలా అయ్యాడబ్బా అని ఆశ్చర్య పోయేలా మొహమాటంతో ఇబ్బంది పడటం నందిని రెడ్డి ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. సాధారణంగా హీరోలు రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు మహా హుషారుగా నటించేస్తారు. అసలే ఇది లిప్ లాక్ కిస్సుల ట్రెండ్ కూడానూ.

దానికి విరుద్ధంగా నాగ శౌర్య ఇలా ప్రవర్తించడం చూసి ముచ్చట వేయక మానదు. సీనియర్ నటి లక్ష్మి కి యంగర్ వెర్షన్ గా ఓ టిపికల్ రోల్ చేస్తున్న సమంతా పక్కన తనను ఇష్టపడే అబ్బాయిగా నాగ శౌర్య పాత్ర ఉంటుంది. ఆ సందర్భంగానే ఈ పాట వస్తుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానున్న ఈ ట్రాక్ సంథింగ్ స్పెషల్ గా నిలవబోతోందని టాక్. రావు రమేష్-రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన ఓ బేబీని సురేష్-మధుర-బిగ్ బెన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి