Begin typing your search above and press return to search.
అప్పుడు రూ.50 లక్షలు సంపాదిస్తే చాలనుకున్నా
By: Tupaki Desk | 17 Jun 2019 2:50 PM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అక్కినేని వారి ఇంటి కోడలు సమంత నటించిన 'ఓ బేబీ' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాలున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె అభిమానులు పలు విషయాల్లో ప్రశ్నలు అడగడం జరిగింది. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సావదానంగా సమంత సమాధానం చెప్పింది. పెళ్లి అయిన తర్వాత అవకాశాలు తగ్గాయంటున్న సమంత.. సినిమాల ఎంపిక విషయంలో తాను చూపిన జాగ్రత్త వల్ల ఇతరుల కంటే తక్కువ కష్టపడ్డా కూడా సక్సెస్ లు వస్తున్నాయని చెప్పుకొచ్చింది.
ఇంకా సమంత అభిమానులకు సమాధానంగా.. సినిమాల్లోకి రాకముందు నేను అమ్మ చాలా సార్లు ఇబ్బందులు పడ్డాం. మాకు గతంలో చాలా మంది సాయం చేశారు. ఆ సమయంలో నేను ఒక సొంత ఇల్లు మరియు రూ.50 లక్షలు బ్యాంక్ బ్యాలన్స్ ఉంటే చాలు అనుకున్నాను. నేను అనుకున్నదాని కంటే ఎక్కువగానే ఇప్పుడు నా వద్ద ఉంది కనుక గతంలో తాము పడ్డట్లుగా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారంటే సాయం చేయాలనిపిస్తుంది. అందుకే స్వచ్చంద సంస్థ ద్వారా సాయం చేస్తూ ఉంటానని సమంత చెప్పుకొచ్చింది.
నేను హీరోయిన్ గా కెరీర్ పెట్టిన సమయంలో వరుసగా అయిదు సినిమాలు నాకు సక్సెస్ వచ్చాయి. దాంతో నేను మళ్లీ వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు అంది. ఇక ఒక ప్రశ్నకు సమాధానంగా సమంత మాట్లాడుతూ.. తాను భవిష్యత్తులో ఖచ్చితంగా నిర్మాణం చేస్తానంది. కాని దర్శకత్వం చేసేంత ఓపిక అయితే తనకు లేదంది. తాను 'ఓ బేబీ' నటించిన తర్వాత అమ్మ వద్దకు వెళ్లి నీకంటూ ఉన్న డ్రీమ్ ఏంటమ్మా అంటూ ప్రశ్నించాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా వారి తల్లిని ఇదే ప్రశ్న అడుగుతారని ఆమె చెప్పుకొచ్చింది. అందరి అంచనాలను తప్పకుండా ఓ బేబీ అందుకుంటుందనే నమ్మకంను సమంత వ్యక్తం చేసింది.