Begin typing your search above and press return to search.

అభిమానుల ప్రేమకు సమంత ఫిదా

By:  Tupaki Desk   |   15 Oct 2017 1:30 AM GMT
అభిమానుల ప్రేమకు సమంత ఫిదా
X
నాలుగేళ్ల ప్రేమ వారిని రెండు సార్లు పెళ్లి బంధంతో ఒకటి చేసింది. సౌత్ స్టార్స్ సమంత - నాగ చైతన్య పెళ్లి ఏ స్థాయిలో జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే ఇంకా వారి వేడుకలు ముగియలేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఇంకా వారి పెళ్లి కి సంబంధించిన న్యూస్ ఎదో ఒకటి వస్తూనే ఉంది. సమంత కూడా సోషల్ మీడియాలో అభిమానుల ట్వీట్స్ ని ఎంతో సంతోషంగా లైక్ చేస్తోంది.

అయితే గోవా లో హిందు - క్రిస్టియన్ పద్దతుల ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంటకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ముఖ్యంగా అక్కినేని అభిమానులు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే కొంత మంది చైతు-సమంత పెళ్లి చేసుకున్న సందర్భంగా మంచి సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రీసెంట్ గా బళ్లారి కి చెందిన కొంత మంది అభిమానులు పేద పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో సమంత వరకు ఆ న్యూస్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అంతే కాకుండా తన ట్విట్టర్ అకౌంట్ లో ఆ కార్యక్రమానికి సంబందించిన ఫోటోని పోస్ట్ చేసి.. వారికి కృతజ్ఞతలు తెలిపింది.

సాదారణంగా సమంత తనకు నచ్చితే అభిమానుల ట్వీట్స్ కి తప్పకుండా ఆన్సర్ ఇస్తూ ఉంటోంది. రీసెంట్ గా విడుదలైన రాజుగారి గది 2 సినిమాకు ట్విట్టర్ లో వచ్చిన రెస్పాన్స్ కి సమంత తనకు వీలైనన్ని ట్వీట్స్ కి థాంక్యూ చెప్పింది. సమంత ప్రస్తుతం సావిత్రి బయోపిక్ మహానటి సినిమతో పాటు రామ్ చరణ్ - రంగస్థలం సినిమా షూటింగ్ లతో బిజీగా వుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సినిమా లేటవుతోందని రోజూ చాలా రూమర్లే వినిపిస్తున్నా.. ఈ చిత్ర యునిట్ మాత్రం నిధానంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.