Begin typing your search above and press return to search.

సమంత చాలా ఎక్సయిట్ అయ్యిందే

By:  Tupaki Desk   |   24 Jan 2018 6:23 AM GMT
సమంత చాలా ఎక్సయిట్ అయ్యిందే
X

టాలీవుడ్ లో ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న రంగస్థలం సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ స్టార్ హీరో హీరోయిన్ ని 1980లోకి తీసుకెళుతుండడంతో ఎలా ఉంటుందా అని అభిమానులు చాలా ఓపికతో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా సమంత పాత్ర ఇందులో ఎలా ఉంటుందో అని సోషల్ మీడియాలో అనేక చర్చలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆమెకు సంబందించిన కొన్ని ఫొటోలు లీకైన సంగతి తెలిసిందే.

ఆ ఫొటోల్లో సమంత బర్రెలతో అలాగే గుడిసెలో ఉండడం చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాను స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా సమంత ఎక్కువగా స్పందించలేదు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా ఆమె చేసిన ట్వీట్ ని చూస్తుంటే చాలా ఎక్సయిట్ అయ్యిందే అని అనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో తాను భాగమైనందుకు చాలా గర్వపడుతున్నానని చెబుతూ డైరెక్టర్ సుకుమార్ హీరో రామ్ చరణ్ అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ది బెస్ట్ టీమ్ అని ట్వీట్ చేసింది.

అంతే కాకుండా చరణ్ స్పెషల్ లుక్ ని కూడా పోస్ట్ చేసి ఆలస్యం అయినా కూడా మంచి సినిమాతో రాబోతున్నట్లు తెలియజేసింది. ఇక సినిమా మార్చ్ 30న రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సాంగ్స్ చిత్రీకరణ జరుగుతోంది. వీలైనంత త్వరగా ఆ పనులను పూర్తి చేసి ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేయాలని అనుకుంటోంది.