Begin typing your search above and press return to search.
సామ్ తప్పు తెలుసుకుందిగా!
By: Tupaki Desk | 18 Aug 2018 4:53 AM GMTనిన్న విడుదలైన యు టర్న్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. థ్రిల్లర్ జానర్ లో సమంతా జర్నలిస్ట్ గా నటిస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి రాహుల్ రవీంద్రన్ భూమిక చావ్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాకపోతే సమంతా డబ్బింగ్ చెప్పడం గురించే చాలా కామెంట్స్ వచ్చాయి. ఇప్పటి దాకా సామ్ కు తెరవెనుక డబ్బింగ్ చెప్పిన చిన్మయి గొంతులోని మేజిక్ వల్లే తన యాక్టింగ్ బాగా ఎలివేట్ అయ్యి మంచి పేరు తెచ్చింది. కానీ యుటర్న్ లో మాత్రం తనే స్వంతంగా డబ్బింగ్ చెప్పేందుకు పూనుకోవడం పట్ల ఫ్యాన్స్ మొదట సంతోషించినా ట్రైలర్ చూసాక మాత్రం కాస్త నిరుత్సాహం చెందారు. కారణం సమంతా గొంతు మరీ పీలగా ఉండటమే. నేనేం చేయలేదు సర్ అని పదే పదే వినిపించే సిగ్నేచర్ డైలాగ్ లో ఇంటెన్సిటీ మిస్ అయ్యిందని ఫీలైన కొందరు అభిమానులు మొత్తానికి దాన్ని సమంతా దృష్టికి తీసుకెళ్లారు. అంతా బాగుందని గొంతు విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించమని కోరారు.
దీనికి స్పందించిన సమంతా డబ్బింగ్ సరిచేస్తామని చెప్పింది.అంటే తనే మళ్ళి బాగా చెబుతుందా లేక యధావిధిగా చిన్మయితో చెప్పిస్తారా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. సమంతా చేసింది మంచి ప్రయత్నమే. కీర్తి సురేష్ లాంటి వాళ్ళు తక్కువ టైంలోనే తెలుగులో తమ డబ్బింగ్ తామే చెప్పుకుని సక్సెస్ అయినప్పుడు ఇంత సీనియర్ హీరోయిన్ గా సమంతా ఒక ట్రయిల్ వేయటం కరెక్ట్. ఎలాగూ ఇది ట్రైలర్ కాబట్టి వచ్చే ఫీడ్ బ్యాక్ ని బట్టి మెయిన్ వెర్షన్ కు మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సామ్ చేయబోయేది అదే. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ మూవీ వచ్చే నెల విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. రోడ్ సైడ్ జరిగిన ఒక యాక్సిడెంట్ గురించి పరిశోధించి జర్నలిస్ట్ గా సమంతా పాత్రే యు టర్న్ లో కీలకంగా ఉంటుంది. అందుకే డబ్బింగ్ గురించి కామెంట్స్ వచ్చినప్పుడు విశ్లేషించుకోవడం అవసరం. సమంతా ఆ విషయంలో జాగ్రత్తగానే ఉంది. అయినా మొదటిసారి డబ్బింగ్ చెప్పినప్పుడు ఇలాంటి కామెంట్స్ సహజం. మాజీ స్టార్ హీరోయిన్లు విజయశాంతి-రాధ-రమ్య కృష్ణ-రోజా లాంటి వాళ్ళు చాలా ఏళ్ళ తర్వాతే తమ సొంత గొంతును సినిమాలో వినిపించలేకపోయారు. ఆ లెక్కన చూసుకుంటే సమంతా కాస్త ముందున్నట్టే.