Begin typing your search above and press return to search.
యుటర్న్.. చివరి 20 నిమిషాలు స్టన్నింగ్
By: Tupaki Desk | 12 Sep 2018 6:48 AM GMTసమంత తొలిసారిగా చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యు టర్న్’. కన్నడలో ఇదే పేరుతో తెరకెక్కిన చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కింది. ఈ సినిమా కన్నడలో విడుదలైన దగ్గర్నుంచి సమంత దానిపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించింది. తన భర్త నాగచైతన్యతో కలిసి బెంగళూరుకు వెళ్లి సినిమా చూసి.. ఆ చిత్ర దర్శకుడు పవన్ కుమార్‌తో మాట్లాడి రీమేక్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చిత్రానికి నిర్మాతల్ని సెట్ చేసింది కూడా సమంతే అంటారు. ఈ గురువారం వినాయక చవితి కానుకగా రాబోతున్న ‘యు టర్న్’ తన కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అని అంటోంది సామ్. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటిదాకా రాలేదని ఆమె అంది. ఈ సినిమా చూడకముందే దీని గురించి విని రీమేక్ చేయాలనుకున్నామని.. ఆ తర్వాత సినిమా చూసి కచ్చితంగా చేయాల్సిందే అని ఫిక్సయ్యామని సమంత చెప్పింది.
‘యు టర్న్’కు సస్పెన్స్ ఫ్యాక్టర్ పెద్ద ఆకర్షణ అని.. ఆద్యంత ప్రేక్షకుల్ని గెస్సింగ్ లో ఉంచేలా సినిమా సాగుతుందని ఆమె అంది. చివరి 20 నిమిషాలు సినిమాకు చాలా కీలకమని.. ఆ 20 నిమిషాలు చాలా స్టన్నింగ్ గా.. థ్రిల్లింగ్ గా గడుస్తాయని సమంత చెప్పింది. తన భర్త నాగచైతన్య సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’కు పోటీగా ‘యు టర్న్’ను రిలీజ్ చేస్తుండటం పట్ల ఎలాంటి టెన్షన్ లేదని ఆమె అంది. ఇలా రెండు సినిమాలూ పోటీ పడాలని తాము కోరుకోలేదని.. ఇలా అనుకోకుండా జరిగిపోయిందని సమంత చెప్పింది. ఈ చిత్రం తెలుగు.. తమిళ భాషలు రెండింట్లోనూ రిలీజ్ కావాల్సి ఉండటంతో విడుదల తేదీ మార్చుకోవడానికి అవకాశం లేకపోయిందని ఆమె అంది. తమ ఇద్దరి చిత్రాలూ బాగా ఆడతాయని.. ఈ సంగతలా వదిలేస్తే చైతూ సంతోషమే తనకు అన్నింటికంటే ముఖ్యమని సమంత స్పష్టం చేసింది.