Begin typing your search above and press return to search.

ఓ మై మ్యాడ్‌ అంటున్న సమంత

By:  Tupaki Desk   |   8 April 2015 11:30 PM GMT
ఓ మై మ్యాడ్‌ అంటున్న సమంత
X
అఖిల్‌ అక్కినేని హీరోగా సత్తా చాటేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున నటవారసునిగా, అక్కినేని హీరోగా ఆరంభమే తనకంటూ ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకోవాలని తపిస్తున్నాడు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. అందుకోసం భారీ యాక్షన్‌ షురూ.. వాటి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆల్రెడీ విడుదలైన టీజర్‌ చూస్తే తెలిసిందిగే.. ఆ సత్తా ఏంటో..

ఇకపోతే ఈ వీడియో టీజర్‌ చూసి అందాల సమంత ఆశ్చర్యప్యోయింది. అఖిల్‌ మేకింగ్‌ వీడియో క్లిప్‌ని ట్విట్టర్‌లో వదిలి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఇదే ఫస్ట్‌లుక్‌. ఈ వీడియోకి అద్భుత స్పందన వస్తోంది. వి.వి.వినాయక్‌ తపన, విక్రమ్‌ రాథోడ్‌ కెమెరా వర్క్‌ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అఖిల్‌ కమిట్‌మెంట్‌ ఎలా ఉందో ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతోంది. అతడు భవిష్యత్‌ సూపర్‌స్టార్‌ అని చెప్పకనే చెప్పింది ఈ క్లిప్‌ అంటూ ఫ్యాన్స్‌తో సెలవిస్తూనే.. ‘‘ఓ మై మ్యాడ్‌.. సూపర్‌.. స్టడ్‌’’ అంటూ అఖిల్‌ను ఆకాశానికి ఎత్తేసింది. కొంపతీసి మనోడి తదుపరి సినిమాలో ఈమెనే హీరోయిన్‌గా తిష్టవేయదు కదా...