Begin typing your search above and press return to search.
పెళ్లి గురించి సమంత ఈసారి ఏమందంటే..
By: Tupaki Desk | 31 May 2016 5:30 PM GMTరెండు వారాల కిందట సమంత ఓ న్యూస్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూ పెద్ద సెన్సేషన్ అయి కూర్చుంది. తాను ఓ తెలుగు యువ కథానాయకుడితో ప్రేమలో ఉన్నానని.. తామిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని.. తమ కుటుంబాల నుంచి అంగీకారం కూడా కుదిరిందని ఆమె చెప్పడం పెద్ద చర్చనీయాంశం అయింది. ఓ వారం రోజుల పాటు మీడియాలో ఇదే హాట్ న్యూస్ అయింది. ఇంతకీ సమంత మనసు దోచిన హీరో ఎవరంటూ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ హీరో ఎవరో జనాలు కూడా ఓ అంచనాకు వచ్చేశారు. దీని మీద ఆ హీరో ఫ్యామిలీలో పెద్ద గొడవైనట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అఆ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చిన సమంతను విలేకరులు పెళ్లి గురించి ప్రశ్నించారు.
ఈసారి మాత్రం సమంత బయటపడలేదు. తెలివిగా సమాధానం దాటవేసింది. ‘‘పెళ్లి గురించి నేను ఒకటి చెబితే...మీరు నలుగురు హీరోల పేర్లు రాసి ఎవర్ని పెళ్లి చేసుకోబోతుందో అంటూ ప్రాబబిలిటీస్ ఇచ్చిసెన్సేషన్ క్రియేట్ చేసేశారు. కాబట్టి పెళ్లి గురించి ఇప్పట్లో ఏమీ మాట్లాడను. ఆ సమయం వచ్చినప్పుడు నేనే మీ అందర్నీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతాను’’ అంటూ మీడియా వాళ్లకు దండం పెట్టేసింది సమంత. ఇక సినిమాల టాపిక్ మీద మాట్లాడుతూ.. వరుసగా తనకు త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కుతుండటంపైనా సమంత ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘‘వరుసగా మూడు సినిమాల్లోనూ త్రివిక్రమ్ గారు నాకే ఎందుకు అవకాశం ఇచ్చారో ఆయన్నే అడిగితే బాగుంటుంది. నిజానికి గౌతమ్ మీనన్.. విక్రమ్ కుమార్ కూడా ఒకసారి నాతో పని చేశాక మళ్లీ మళ్లీ నాకు అవకాశాలు ఇచ్చారు. నా పాత్రకు న్యాయం చేయాలని నేను కష్టపడతాను. బహుశా నా వర్కింగ్ స్టైల్ నచ్చి మళ్లీ అవకాశాలు ఇస్తున్నారేమో’’ అని సమంత అంది.