Begin typing your search above and press return to search.

సమంతకే అంత అదృష్టం ఎందుకంటే..

By:  Tupaki Desk   |   12 Jun 2016 11:00 AM IST
సమంతకే అంత అదృష్టం ఎందుకంటే..
X
నిజానికి ఎప్పుడైతే ''అ..ఆ'' సినిమా కూడా 1 మిలియన్‌ డాలర్‌ క్లబ్ లోకి ఎంటర్‌ అయ్యిందో.. అందరూ అప్పటి నుండి సమంత చాలా లక్కీ అనడం మొదలెట్టారు. ఇప్పుడిక ఆ సినిమా 2 మిలియన్‌ డాలర్స్ కూడా దాటేసింది కాబట్టి.. అబ్బా సమంత వీర లక్కీ అంటున్నారు. ఇది కేవలం మామూలు ప్రేక్షకులే కాదు.. టాప్‌ హీరోయిన్లు కూడా ఇదే మాట. కాని మన స్టార్‌ హీరోయిన్లు తెలుసుకోవాల్సిన మరో విషయం ఉంది. సమంత అంత ఈజీగా ఈ పొజిషన్ ను రీచ్‌ కాలేదు.

అసలు మ్యాటర్‌ ఏంటంటే.. సమంతతో పాట కాజల్‌ - తమన్నా - శృతి హాసన్‌ - త్రిష వంటి బ్యూటీలకు కూడా సేమ్ టు సేమ్ అవకాశాలు చాలా వచ్చాయి. కాని సెట్లో చేసే డిమాండ్ల దగ్గర నుండి.. సినిమా రిలీజ్‌ టైములో ప్రమోషన్లకు రావడం వరకు.. సమంత స్టయిలే వేరు. టెంపర్‌ సినిమా ప్రమోషన్లకు కాజల్‌ రాలేదు. కారణం ఏదన్నా కావొచ్చు.. కాని అమ్మడు డుమ్మా కొట్టింది. అదే సమంత ఒక్కసారైన అలా హ్యాండిచ్చిందా? సినిమా రిలీజయ్యాక బ్రహ్మోత్సవం గురించి మాట్లాడలేదేమో.. కాని రిలీజయ్యేవరకు ప్రమోట్‌ చేస్తూనే ఉంది. ఇక తమన్నాలో ఎంత టాలెంట్‌ ఉన్నా కూడా.. ప్రమోషన్లకు ప్రతీసారి భారీ బిల్లులు కోట్‌ చేయడం (తనతో పాటు ఓ నలుగురికి బిజినెస్ క్లాస్‌ టిక్కెట్లు).. వివిధ ఛానళ్ళకు తిరగడానికి ఇష్టం చూపించకపోవడం.. ఎంతసేపూ బాలీవుడ్‌ లో ఏదన్నా కొట్టేద్దాం అని తహతహలాడటంతో ఆమెను కొందరు పక్కనెట్టేశారు. శృతి హాసన్‌ అయితే ఏకంగా కొంతమంది లీగల్‌ నోటీసులు ఇచ్చింది.. కొందరి దగ్గర నుండి లీగల్‌ నోటీసులు అందుకుంది. ఇవన్నీ నిర్మాతలకు కాస్త వణుకు పుట్టించే అంశాలు. త్రిష సంగతులు వేరే చెప్పక్కర్లేదు.

ముఖ్యంగా నిర్మాతలకు దర్శకులకూ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్‌ లో పనిచేసే సమంత అంటేనే ఎక్కువ ఇష్టం. మీడియాకు కూడా ఆమె అంటేనే ఇష్టం. ఈ పాజిటివిటీ అంతా ఆమె సినిమాల రిజల్టుపై కూడా పడుతోంది. దానితో ఆమె మాంచి సినిమాల్లో భాగమవుతోంది. మిలియన్ డాలర్ల క్లబ్బుల్లో కూర్చుంటోంది. ఇదంతా అదృష్టమేనా అంటే.. మరి అదృష్టమే.