Begin typing your search above and press return to search.
పిల్లల్ని కనరా అని ప్రతిసారీ విసిగిస్తే!!
By: Tupaki Desk | 5 July 2019 1:30 AM GMTపెళ్లయిన జంటకు ఎదురయ్యే రెగ్యులర్ ప్రశ్న `పిల్లల్ని కనరా?`. ఫ్రెగ్నెన్సీ ఎపుడు? అన్న ప్రశ్న తప్పనిసరి. ప‌్రస్తుతం ఈ ప్రశ్నలు అక్కినేని కోడలు సమంతకు ఎదురవుతున్నాయి. ప్రతిసారీ ఇంటర్వ్యూల్లో ఈ ప్రశ్నను ఎదుర్కోవడం తప్పడం లేదు. అయితే దీనికి సమాధానం చెప్పేందుకు విసుక్కోరా? పదే పదే అదే ప్రశ్న అడుగుతుంటే మీకేమీ అనిపించదా? కెరీర్ పరంగా బిజీగా ఉన్నామని చెప్పాల్సొస్తోందా? అని అడిగేస్తే ఏమన్నారంటే..
ఆ ప్రశ్న అడగడం తప్పేమీ కాదని సమంత అభిప్రాయపడ్డారు. సమంత మాట్లాడుతూ ``అదేమీ క్రిటిసిజం కాదు. నేను కూడా ఫ్రెండును కలిస్తే పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావ్ ? అని అడుగుతాను. అలా అడగడం తప్పయిపోయిందని అనుకోను. భగవంతుడి దయ వల్ల నేను చాలా స్వతంత్రంగా ఉండగలుగుతున్నా. నాకు ఈ ఏడాది పిల్లలు వద్దని చెప్పగలుగుతున్నా. ఆ పరిస్థితి మన అమ్మకో.. అమ్మమ్మకో ఉండేదా? వాళ్లకు అసలు జీవితంలో ఎలాంటి కోరికలు ఉండేవి? వాటిని నెరవేర్చుకోవడానికి వారు ఎప్పుడైనా ప్రయత్నించారా? వంటి ప్రశ్నలన్నీ మనకు ఓబేబీ చూశాక కలుగుతాయి`` అని అన్నారు సమంత. ఓ బేబి చేసిన తర్వాత నా ధృక్పథంలో చాలా మర్పు వచ్చిందని సామ్ తెలిపారు.
అప్పట్లో బేబీని కనకపోతే `ఎందుకు` అని అడిగేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ రోజుల్లో అమ్మాయిలు యాంబిషన్స్ కోసం కొన్ని వాయిదా వేస్తున్నారని సామ్ అభిప్రాయపడ్డారు. `అమ్మతనం` అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు.. `అమ్మ అంటే సెల్ఫ్ లెస్!` అని అన్నారు. ఎక్కడైనా.. నాన్న జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటారు అంటారు. కానీ గృహిణిగా ఉన్న అమ్మ ఇల్లు చూసుకుంటోంది అనరు కదా? అమ్మ అంటే అదే.. సెల్ఫ్ లెస్ అని నా అభిప్రాయం. మా అమ్మ కూడా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అని అనేది. ఎలాంటి స్వార్థం లేకుండా ఉండేది అమ్మ... అని సమంత `అమ్మ` అనే మాటకు మీనింగ్ ఏమిటో అద్భుతంగా చెప్పారు. ఓ బేబీలో కష్టపడి చేసిన సీన్ ఏది? అని ప్రశ్నిస్తే.. పతాక సన్నివేశం కోసం శ్రమించాల్సొచ్చిందన్నారు. మామూలుగా ఎమోషనల్ సీన్ అంటే ఈజీగా చేస్తాననే ధీమా ఉండేది. కానీ ఎందుకో ఆ రోజు ఏడుపు రాలేదు. నా కెరీర్ మొత్తం మీద నేను రెండు గంటలు బ్రేక్ తీసుకుని ఏడుపు తెచ్చుకుని చేసిన సినిమా ఓ బేబి.. అని తెలిపారు.