Begin typing your search above and press return to search.
సమాజానికి తిరిగిచ్చేసేందుకే -సమంత
By: Tupaki Desk | 5 Sep 2016 5:11 AM GMTహీరోయిన్ గా టాప్ రేంజ్ లో ఉండడమే కాదు.. సమంతకు ఎంతో సున్నితమై మనసు ఉందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఒక చిన్న సాయం చేసి.. తెగ ప్రచారం చేసేసుకునే వారు చాలా మందే ఉంటారు. కానీ వేలకొద్దీ చిన్నారులకు సాయం చేస్తూ.. ఎలాంటి పబ్లిసిటీ కోరుకోని అరుదైన వ్యక్తిత్వం సమంతది. సమాజం నుంచి ఎంతో తీసుకునే మనం.. తిరిగిచ్చేయాలంటూ.. సినిమాలో డైలాగులతో సరిపెట్టకుండా.. ప్రత్యూష అనే సంస్థ పేరుతో ఎంతో సేవ చేస్తోంది సమంత.
దిల్ సుఖ్ నగర్ బాంబ్ పేలుళ్ల సమయంలో అందరికంటే వేగంగా రియాక్ట్ అయింది సమంతే. 'అప్పుడు కాలు కోల్పోయిన రజితను ఆధుకున్న తీరు నాకు జీవితాతం గుర్తుంటుంది. రీసెంట్ గా చాందిని అనుభవం కూడా అలాంటిదే. నానమ్మ- చాందినిలు రోడ్డుపై నడుస్తుంటే యాక్సిడెంట్ లో ఆ పెద్దావిడ రెండు చేతులు.. చాందిని కాలు విరిగిపోయాయి. లక్ష రూపాయలకు పైగా ఖర్చయ్యే ఈ ఆపరేషన్ ఖర్చుల కోసం మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి ద్వారా చికిత్స చేయించాం.' అని చెప్పింది సమంత.
ఇలాంటి అనుభవాలు జీవితాంతం గుర్తుంటాయన్న సమంత.. జీవితాన్ని అర్ధవంతంగా మార్చేది ఇలాంటి సాయాలే అంటోంది. తన ద్వారా ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే.. దేవుడు తనకింత మంచి స్థాయి ఇచ్చాడని సమంత చెబుతుండడం విశేషం. అసలు ప్రత్యూష అంటే ఏంటో తెలుసా.. ఉదయించే సూర్యుడి లేలేత కిరణాలు. సమంత సాయానికి సరైన పేరు కదూ.