Begin typing your search above and press return to search.
నాలోని విమర్శకురాలు బయటకొచ్చేది అప్పుడే
By: Tupaki Desk | 5 Oct 2015 4:01 AM GMTసినిమావాళ్ళకి అత్యంత సంతోషకర సమయం ఎప్పుడంటే వారు నటించిన సినిమా హిట్ అయ్యి అందులో వారి పాత్రకు ఇంకా మంచిపేరు వచ్చినపుడు. అలాంటి సమయంలో ఎవరైనా సాధారనంగా తమ కష్టం ఫలించిందని లేదా దీన్ని ముందే ఊహించామని చెబుతూంటారు. ఒక్కోసారి వారి ఆనందం మాటల్లో చెప్పలేని పరిస్థితి. కానీ నా వరకు అది నిజం కాదంటోంది సమంత. ఎందుకంటే నాలోని విమర్శకురాలు బయటకొచ్చేది అప్పుడే అంటోంది. అంటే.. దీనికి నేను అర్హురాలినేనా అని ఆత్మపరిశీలన చేసుకుంటుందట ఈ చెన్నై సోయగం. నిజంగా చాలా మంచి లక్షణం కదూ..!
కెరీర్ ఆరంభం లోనే గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న సమంత తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూనే వుంది. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగు తెరపై కనపడని ఈ చిన్నది ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాతోపాటు త్రివిక్రమ్ అ.ఆ.. సినిమాలకు సంతకం చేసింది. తమిళంలోనూ విక్రమ్ - సూర్య లాంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. ఆ సినిమాలు తెలుగు తెరపైకి ఎలాగో వస్తాయి. విక్రమ్ హీరోగా తెరకెక్కిన 10 ఎంద్రతుకుల్ల ఈ నెలలోనే విడుదల కానుంది. మిగిలిన సినిమాలు వచ్చే ఏడాది క్యూ కట్టనున్నాయి. ఓ రకంగా సమంత రెండు భాషలు కలుపుకుని 4 సినిమాలను సిద్ధం చేస్తున్నట్టే. ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకం అంటున్న సమంత ఈ సినిమాలపై చాలా నమ్మకంగా వుందట.